రాష్ట్రపతి పదవి పరిశీలనలో అమితాబ్ పేరు.!?

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ….ఆయన మూలాలు మాత్రం కాంగ్రెస్ పార్టికి చెందినవే… మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయనను తప్పిస్తారు అనే ప్రచారం జోరుగా సాగినప్పటికి ఆ పని మాత్రం కార్యరూపం దాల్చలేదు. నెక్ట్స్ ప్రెసిడెంట్ అద్వానీ  అని ఆయన పేరు అప్పట్లో  గట్టిగానే వినిపించింది. ఎందుకో వెంటనే చల్లబడింది. తాజాగా మరోమారు ప్రెసిడెంట్ పీఠంపై ప్రణబ్ తర్వాత ఎవరు కూర్చోబోతున్నారు అనే అంశానికి సంబంధించి కొన్ని లీకులు బయటికి పొక్కుతున్నాయి.

బిగ్ బి అమితాబ్ పేరును రాష్ట్రపతి పదవి కోసం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.  దేశంలోనే అతిపెద్ద సెలబ్రిటీగా ఉన్నప్పటికీ వివాదాల్లో ఆయన పేరు లేకపోవడం ఆయన ప్లస్ పాయింట్, దానికి తోడు బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండడం… గత ప్రస్తుత ప్రభుత్వాలు చేపట్టిన మంచి పనులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడాలు కూడా కలిసొచ్చే అంశాలే..!

Modi_Amitabh_85676_1559175f

రాష్ట్రపతి రేసులో శతృజ్ఙ సిన్హా పేరు కూడా వినిపిస్తుంది. అయితే రాజకీయ లెక్కలు వేసుకుంటే ఆ పదవి అమితాబ్ కే దక్కే అవకాశాలు ఎక్కువనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఎందుకంటే రాష్ట్రపతిని ఎంపిక చేసే ప్రాథమిక విధానమే అది..కళలు లేదా సామాజిక కార్యకమాల్లో లబ్ద ప్రతిష్టులైన వారిని మాత్రమే రాష్ట్రపతి , గవర్నర్ లుగా నియమించాలన్నది ప్రైమరీ పాయింట్…….   అమితాబ్ పేరును ప్రతిపాదిస్తే ప్రతిపక్షాలు కూడా పెద్దగా రాద్దాంతం చేయవు అనేది సెకెండ్ పాయింట్…..ఇవి చాలవా..? అమితాబ్ గారు ప్రెసిడెంట్ కాడానికి అంటున్నారు కొంత మంది పెద్దలు.

Comments

comments

Share this post

scroll to top