ఎనిమిది వేల పెట్టుబ‌డి..500 కోట్ల రాబ‌డి – వాట్ ఏ జ‌ర్నీ

ద‌మ్ముండాలే కానీ ఆకాశాన్ని అందుకోవ‌చ్చు. మండే గుండెల‌కు భ‌రోసా క‌ల్పించ‌వ‌చ్చు. వంద‌లాది మందికి ఉపాధి చూపించొచ్చు. కావాల్సింద‌ల్లా భిన్నంగా ఆలోచించ‌డం..విభిన్నంగా ప్ర‌యాణం చేయ‌డం. మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభించ‌డం ఇదే నేటి అంకురాల‌కు అంకురార్ప‌ణ చేస్తే చాలు ..రూపాయ‌ల‌తో పాటు డాల‌ర్లు మ‌న చెంత‌కు చేరుతాయి. ఇండియాలో కేవ‌లం 8 వేల రూపాయ‌ల పెట్టుబ‌డితో 500 కోట్ల రూపాయ‌ల‌ను ఆదాయంగా స‌మ‌కూర్చు కోవ‌డం న‌మ్మలేని నిజం..ఇది మ‌న ముందున్న వాస్త‌వం. ఈ రియ‌ల్లీ స్టోరీని తెలుసు కోవాలంటే ..గూర్గాన్ కేంద్రంగా ప్రారంభించిన ఈ స్టార్ట‌ప్ కంపెనీ ఓన‌ర్ అమిత్ దాగా గురించి తెలుసు కోవాల్సిందే. ఎందుకంటే అత‌ను సాధించిన ఈ విజ‌యం అసాధార‌ణ‌మైన‌ది. ఎంద‌రికో స్ఫూర్తి దాయ‌కంగా నిలుస్తుంది.

న‌మ్మ‌కం, నాణ్య‌త‌, వినియోగ‌దారుల అభిరుచుల‌కు అనుగుణంగా ప్రొడ‌క్ట్స్ ను చేర‌వేయ‌డం ఇదే వ్యాపార విజ‌య ర‌హ‌స్యం. ప్ర‌తి రోజు ల‌క్ష‌లాది మంది త‌మ అవ‌స‌రాల నిమిత్తం ఏదో ఒక‌టి కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, రియ‌ల్ ఎస్టేట్, టెలికాం రంగాలు అభివృద్ధి చెందుతుండ‌డం..వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా ఉద్యోగాలు ల‌భించ‌డం..వారంతా కొనుగోళ్ల‌పై ఆస‌క్తిని చూపించ‌డం వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించేలా చేసేందుకు దోహ‌ద ప‌డుతోంది. మ‌ల్టీ నేష‌న‌ల్ బ్రాండ్స్ గా పేరొందిన సామ్ సంగ్, ఫిలిప్స్, హెచ్‌పీ, లెనెవో, విర్ల్ పూల్, హావెల్స్..లాంటి కంపెనీల‌కు ఆథ‌రైజ్డ్ డీల‌ర్‌గా ఉన్నారు అమిత్. క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్ అండ్ ఐటీ ( సిడిఐటి) వ‌స్తువుల‌ను డెలివ‌రీ చేస్తుంది ఈ కంపెనీ. కేవ‌లం కాలేజీ పాసైన కుర్రాడు..ప‌ట్టుమ‌ని 19 ఏళ్లు నిండ‌లేదు. కానీ ఎంతో అనుభ‌వం గ‌డించాడు. మార్కెట్‌లోని మెళ‌కువ‌ల‌ను గుర్తించాడు.

సీడ్ కేపిట‌ల్ కింద కేవ‌లం 8 వేల రూపాయ‌లు పెట్టుబ‌డిగా పెట్టాడు. 1999లో డిస్ట్రిబ్యూష‌న్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. దాని పేరు డిబిఎం మార్కెటింగ్. మొద‌ట్లో వ్యాపారం అంత‌గా సాగ‌లేదు. ఎన్నో ఇబ్బందులు. ల‌క్సార్ పెన్నుల‌ను అమ్మాడు గుర్గాన్లో. డీల్ క్యా హై ..ఇదీ అమిత్ దాగా ట్యాగ్ లైన్. లైఫ్ లైన్ కూడా. వినియోగ‌దారులు కోరుకున్న వ‌స్తువుల‌ను అందించ‌డం అన్న దాని మీదే కాన్ సెంట్రేష‌న్ చేశాడు. ఇపుడు దాగాకు 38 ఏళ్ల వ‌య‌సు. గ్రాడ్యూయేష‌న్ పూర్తి చేశాడు. ఐఎంటీ ఘ‌జియాబాద్ నుండి పీజీడిబిఎం చ‌దివాడు. కార్పొరేట్ కంపెనీల ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడల్లా న‌న్ను ప‌ట్టించు కోలేదు. రాను రాను వారు న‌న్ను న‌మ్మారు. డెలివ‌రీ అన్న‌ది క‌రెక్టుగా ఉండాలి. టైం త‌ప్ప‌కూడ‌దు. ఇదే మొద‌టి సూత్రం విజ‌యానికి. ఓ వైపు నిరాశను ద‌రిచేర‌నీయ లేదు ఎన్న‌డూ. పార్క‌ర్ పెన్నులు గుర్తుండే వుంటాయి. ఎన్ని పెన్నుల కంపెనీలు మార్కెట్‌లోకి వ‌చ్చినా..ఆ కంపెనీ బ్రాండ్ ప్ర‌తి కంపెనీలో క‌నిపిస్తుంది.

బ్రాండ్ అలాగే ఉంది..నాణ్య‌త కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌టే. రీజిన‌ల్ మేనేజ‌ర్‌గా ఉన్న రోహిత్ మాథుర్ త‌న‌కు ఆద‌ర్శ‌మంటారు దాగా. సంస్థాగ‌తంగా ఎలా సేల్ చేయాలి, కార్పొరేట్ క్ల‌యింట్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్లేట‌ప్పుడు ఎలా ప్రజెంటేష‌న్ చేయాలో ద‌గ్గ‌రుండి మాథుర్ మెళ‌కువ‌లు అమిత్ కు చెప్పారు. అవి ఎంత‌గానో ఉప‌యోగ ప‌డ్డాయి త‌న వ్యాపారానికి. రోహిత్ ఇండియాలోనే బెస్ట్ సెల్ల‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. కోట్ల‌ల్లో పెన్నులు అమ్మాడు. అమ్మ‌డం ఎవ‌రైనా చేస్తారు..కానీ మ‌న వ‌స్తువుకున్న బ్రాండ్ పెంచుకుంటూ పోవాలి. క‌స్ట‌మ‌ర్లు వారంత‌కు వారే వ‌స్తుంటారు అంటారు అమిత్. ఎవ‌రికైతే స‌ప్ల‌యి చేస్తామో వారికి 30 నుంచి 35 రోజులు గ‌డువు ఇవ్వ‌డం వ‌ల్ల మ‌రింత సేల్స్ పెంచుకునే వీలు క‌లుగుతుంది.

మెల మెల్ల‌గా డిబిఎం మార్కెటింగ్ పుంజుకుంది. భారతీ టెలీటెక్ కంపెనీతో ఒప్పందం పెట్టుకున్నాడు. ఆ కంపెనీ క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్ అండ్ ఐటీ ప్రొడ‌క్ట్స్ స‌ర‌ఫ‌రా చేసేలా సంత‌కం చేశారు. ల్యాప్ టాప్స్, మొబైల్స్, మిక్స‌ర్స్, జార్స్, కిట్స్ కూడా ఇందులో ఉన్నాయి. డిబిఎం కంపెనీని ప్రారంభించిన‌ప్పుడు త‌ను ఒక్క‌డే.. ఆఫీస్ బాయ్‌, అడ్మిన్ గై, డెలివ‌రీ బాయ్, అకౌంటెంట్, సేల్స్ మెన్ అవ‌తారం ఎత్తాడు. సేల్స్ మెన్ నుండి ఆఫీస్ అసిస్టెంట్ గా ఇన్ని ప‌నులు త‌నే చేశాడు. 25 రోజుల పాటు కాళ్ల‌రిగేలా తిరిగాడు. 35 లక్ష‌ల విలువ చేసే పెన్నులు అమ్మాల‌న్న‌ది టార్గెట్. దానిని 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు అమ్మాడు అమిత్. ఈ కామ‌ర్స్ బిజినెస్ ఊపందు కోవ‌డంతో ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూష‌న్ సిస్టంను డెవ‌ల‌ప్ చేశాడు. నేరుగా ఉత్ప‌త్తులు త‌యారు చేసే కంపెనీల‌తో నేరుగా ఎంఓయు కుదుర్చుకున్నాడు అమిత్ దాగా. రిటైల్ నెట్ వ‌ర్క్ ను స్టార్ట్ చేశాడు.

ఆన్ లైన్‌లో పోర్ట‌ల్ ప్రారంభించాడు. పాన్ ఇండియా ..టెక్నాల‌జీ..లాజిస్టిక్ పార్ట‌న‌ర్ షిప్ కింద కంపెనీని రిజిష్ట‌ర్ చేశాడు. అన్ని రిల‌య‌బుల్ ప్రాడ‌క్ట్స్ అన్నింటికి స్పెష‌లైజ్‌డ్‌గా ఆథ‌రైజ్డ్ డీల‌ర్ గా బ‌డా కంపెనీలు గుర్తించాయి. అమెజాన్ కంపెనీ కూడా డిబిఎంతో ఒప్పందం చేసుకుంది. ప్ర‌స్తుతం దీని వ్యాపారం నెల‌కు 40 నుంచి 50 కోట్ల రూపాయ‌లు. న‌మ్మ‌కం..డెలివ‌రీ క‌చ్చితంగా ఉండ‌డంతో కంపెనీల‌న్నీ డిబిఎం కోసం క్యూ క‌ట్టాయి. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, షాప్ క్లూస్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ కంపెనీల‌తో పాటు లాజిస్టిక్స్ పార్ట్ న‌ర్స్ గా డిల్లీవెరీ, బ్లూ డార్ట్, ఫెడెక్స్, ఆరామెక్స్, ఫ‌స్ట్ ఫ్లైట్ కూడా ఇందులో ఉన్నాయి. ఢిల్లీ, ఉత్త‌ర్ ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర‌, వెస్ట్ బెంగాల్, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌లో వేర్ హౌస్‌ల‌ను ఏర్పాటు చేస్తోంది. 48 మంది ఉద్యోగులు ఆయ‌న వ‌ద్ద ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్నారు. 2020 నాటిక‌ల్లా 2000 వేల కోట్ల వ్యాపారం చేయాల‌న్న‌ది త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని అంటున్నారు అమిత్ దాగా. సో..ఆయ‌న ఆశ‌యం నెర‌వేరాల‌ని ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top