అమైరాని వేధించిన స్టార్ హీరో అల్లుడు ! ఇంతకీ ఎవరు.ఆ హీరో .?

ధనుష్….ఈ పేరు వినగానే మనకు గుర్తు వచ్చే సినిమా రఘువరన్ బి.టెక్ , రఘువరన్ బి.టెక్ సినిమా తో తెలుగులో సంచలనం సృష్టించాడు, అంతకు ముందు 3 మూవీ లో ‘వై దిస్ కొలవెరి’ పాటతో భారత దేశం అంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు, ప్రెసిడెంట్ నుండి పెరుగన్నం తినే పసి పిల్లోడి వరకు అందరు ఆ పాటకి బానిస అయిపోయారు, అంతలా అందర్నీ మంత్ర ముగ్ధుల్ని చేసింది ఆ పాట. ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గారి అల్లుడు అయిన ధనుష్, ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డాడా?

అమైరా దస్తూర్…. ‘మనసుకు నచ్చింది’,’రాజుగాడు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దెగ్గర అయిన ఈ భామ,దక్షిణాదిన ఒక స్టార్ హీరో అల్లుడు నన్ను లైంగికంగా వేధించాడని తెలిపింది,ఆ హీరో ధనుష్ ఏన? అసలు విషయానికి వస్తే #మీటూ ఉద్యమం గురుంచి అందరికి తెలిసిందే.

అమైరా దస్తూర్ మాట్లాడుతూ -“త‌న‌ను ఓ స్టార్ హీరో అల్లుడు లైంగికంగా వేధించాడు. ద‌క్షిణాదిన మంచి ప‌లుకుబ‌డి ఉన్న ఆ హీరో పేరు చెబితే నా కెరీర్ పూర్తిగా స‌ర్వ‌నాశనం అవుతుందేమోన‌ని నా భ‌యం. అందుకే ఇప్పుడు ఆ హీరో పేరు చెప్ప‌ను. టైం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌క ఆ హీరో పేరు బ‌య‌ట‌పెడ‌తాను. ద‌క్షిణాదిన సినిమా అవ‌కాశాలు రాక‌పోయిన ప‌ర్లేదు కాని ఆ హీరోని మాత్రం వ‌ద‌ల‌ను. త‌న‌కి ఉత్తరాదిన క‌న్నా ద‌క్షిణాదినే ఎక్కువు వేధింపులు ఎదురయ్యాయి. సౌత్ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఓ సినిమా చేస్తున్న స‌మ‌యంలో ఆ హీరో త‌న మీద చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు దృష్టికి తీసుకెళ్ళిన కార‌ణంగా త‌ర్వాత నాకు నరకం చూపించాడు. తొంద‌ర‌గా షూటింగ్ రమ్మనేవారు. షాట్ కోసం రెడీ అయ్యి కూర్చొని ఉండ‌గా, ఎంతకి పిలిచే వారు కాదు. ఒక్కోసారి రోజంతా కూర్చోబెట్టి ఐదు నిమిషాలు మాత్ర‌మే షూటింగ్ చేసేవారు. షూటింగ్ లేక‌పోయిన ఆ విష‌యం త‌న‌కి చెప్పేవారు కాద‌ని, దీంతో నాకు ద‌క్షిణాది సినిమాలు చేయాలంటేనే ఓ ర‌కం భ‌యం మొదలైంది”.

అమైరా, ‘ధనుష్’ పేరు చెప్పకపోయినా ఆ నటుడు ధనుష్ అనే అర్ధం అవుతుంది, దక్షిణాదిన ఇంత వరకు అమైరా చేసిన చిత్రాలు 3 మాత్రమే, అందులో స్టార్ హీరో అల్లుడు ‘ధనుష్’ ఒక్కడే.అమైరా, ధనుష్ కలిసి ‘అనేగన్’ అనే మూవీ లో నటించారు, రంగం మూవీ దర్శకుడు కేవీ.ఆనంద్ అనేగన్ చిత్రానికి దర్శకత్వం వహించారు.అయితే మరికొందరు మాత్రం, ఆ వ్యక్తి ధనుష్ కాదని, అమైరా వేరే చిత్రం చేస్తుండగా ఆ సంఘటనలు జరగటం తో ఆ సినిమా నుండి మధ్యలోనే వైదొలిగిందనీ చెబుతున్నారు, ప్రస్తుతం అమైరా మాటలు సౌత్ ఇండియా ని కుదిపేస్తున్నాయి, ఆ వ్యక్తి ధనుష్ ఏ అని, కాదు వేరే వాడు అయి ఉంటాడని చర్చలు మొదలుపెట్టారు.

Comments

comments

Share this post

scroll to top