అతనికి రెండు చేతులు లేవ్.! అయితేనేం…బంతితో గూగ్లీ, బ్యాట్ తో సిక్సర్ల వర్షం కురిపిస్తాడు.!

రెండు చేతులు లేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడతాడు, గ్రౌండ్ లో బ్యాట్ పట్టుకొని దిగాడంటే సిక్సర్లే సిక్సర్లు. అతడి పేరే ఆమీర్. జమ్ముకాశ్మీర్ కు చెందిన ఆమీర్ కాళ్ళతో బంతిని గింగరాలు తిప్పుతూ  గూగ్లీ వేస్తాడు, మెడ సహాయంతో బ్యాట్ పట్టుకొని సిక్సర్ల మోతమోగిస్తాడు. లక్నోలోని కేడి సింగ్ బాహు  స్టేడియంలో ఇంటర్-పాలిటెక్నిక్ మధ్య జరిగిన మ్యాచ్ లో అతడి ఆటను  చూశాకా చాలా మంది మనోడి ఫర్ఫార్మెన్స్ కు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు.

aamirhussain_1449648362

10 ఏళ్ళ కిందట సామిల్ లో జరిగిన ప్రమాదంలో ఆమీర్ రెండు చేతులను కోల్పోయాడు. మూడేళ్ళపాటు హాస్పిటల్ లో చికిత్స పొందాడు. అయినా తన నమ్మకాన్ని, ధైర్యాన్ని కోల్పోలేదు. క్రికెటర్ కావాలని తన ప్రతిభను ప్రపంచానికి తెలపాలని అనుకున్నాడు.  ఒకవైపు క్రికెట్ అంటే ఆసక్తి కనబరుస్తూనే మరోవైపు ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. తనభారం తన తల్లిదండ్రులకు కలగకూడదని భావించిన ఆమీర్ తన బట్టలను తనే శుభ్రం చేసుకోవటం దగ్గర నుండి స్నానం చేయడం, బట్టలు  ఐరన్ చేయటం, ఆహారం తీసుకోవటం అన్నీ తనే చేసుకునేవాడు.
aamirhussain5_1449648364
మొదట తన బట్టలను  సొంతంగా తొడుక్కునేప్పుడు  కొంచెం ఇబ్బందిపడ్డా తర్వాత అలవాటు చేసుకున్నాడు.  పేదరికంలో జన్మించిన ఆమీర్ కుటుంబానికి పూటగడవడమే కష్టం, కానీ తన లక్ష్యాన్ని మాత్రం ఏనాడు పక్కనపెట్టలేదు. ధైర్యాన్ని కోల్పోలేదు. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే ఆమీర్ కు సచిన్, ధోని, రైనాలంటే అభిమానం. ఒకసారి తమ జిల్లాకు ధోని, రైనాలు వచ్చారని చూడటానికి వెళ్తే అక్కడ భద్రతా సమస్యల వల్ల వారిని కలుసుకోలేకపోయాడు. అయితే సచిన్, ధోని, రైనాలను కలుసుకోవాలని,వారితో మాట్లాడని తన మనసులో మాట చెప్పాడు ఆమీర్.
aamirhussain4_1449648363

Comments

comments

Share this post

scroll to top