ఒకప్పుడు రాజుల కాలంలో కావచ్చు. ఆ తరువాత వచ్చిన నాయకులు కావచ్చు. వారిలో కొందరు క్రూరమైన పాలన చేసి నియంతలుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడమే కాక, వారిని అన్ని రకాలుగా హింసిస్తూ, చంపుతూ కొందరు నేతలు పాలన చేశారు. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా సరిగ్గా అలాంటి ఓ నేత గురించే. కాకపోతే అతను ఇక్కడివాడు కాదు. ఉగాండా వాసి. పేరు.. ఈదీ అమీన్ దాదా. ఇతని గురించి అనేక దేశాల వాసులకు తెలియకపోవచ్చు. కానీ ఉగాండాలో ఇతని పేరు చెబితే ఒకప్పుడు జనాలు ఉలిక్కిపడేవారు. అంతటి క్రూరమైన పాలన కొనసాగించాడితను.
ఈదీ అమీన్ దాదా 1923లో జన్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఉగాండాలో ఉన్న కొబొకొ, కంపాలా నడుమ ఓ ప్రాంతంలో ఇతను జన్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఇతని తండ్రి పేరు అండ్రియాస్ న్యబిరె. కాగా అమీన్‌ను అతని తండ్రి విడిచి పెట్టాడు. దీంతో తల్లి వద్ద అతను పెరిగాడు. అతను జన్మించిన ప్రాంతంలో ఉన్న ఓ ఇస్లాం స్కూల్లో చేరాడు. రోమన్ క్యాథలిక్ అయిన ఇతను ఆ స్కూల్లో చేరాక ముస్లింగా మారిపోయాడు. అయితే అమీన్ తరువాత ఎక్కడ చదువుకున్నాడో, ఎలా పెరిగాడో ఎవరికీ తెలియదు కానీ.. యుక్త వయస్సులో ఓ బ్రిటిష్ ఆర్మీ అధికారి ఇతన్ని ఆర్మీలోకి తీసుకున్నాడు. అక్కడి నుంచి అంచలంచెలుగా ఇతను ఎదిగాడు. ఆ క్రమంలోనే 1971వ సంవత్సరంలో అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ మిల్టన్ ఒబొటె ను అమీన్ గద్దె దించి ఉగాండా అధ్యక్ష పీఠం ఎక్కాడు. అప్పటి నుంచి ఆ దేశంలో అతను రాక్షస పాలన కొనసాగించాడు.
ఉగాండాలో ఉన్న భారతీయులందరినీ బలవంతంగా సొంత దేశానికి పంపాడు. ఉగాండాలో రైల్వే వ్యవస్థను నిర్మించేందుకు భారత్ నుంచి వచ్చిన 30వేల మంది కార్మికులను కిరాతకంగా ఉరి తీయించాడు. 1972వ సంవత్సరంలో 5వేల మంది అకోలీ, లాంగో సైనికులు అనుకోకుండా అదృశ్యమయ్యారు. వీరిలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వారిని అమీన్ చంపించి సమీపంలో ఉన్న నైలు నదిలో వారి మృతదేహాలను పారవేయించాడని చరిత్ర చెబుతోంది. ఇక అమీన్ తన 8 సంవత్సరాల పాలనలో మొత్తం 80వేల మందిని దారుణంగా చంపించాడని చరిత్ర చెబుతుండగా, కొందరు మాత్రం ఆ సంఖ్య 3 లక్షలుగా ఉంటుందని అంటున్నారు. ఇవే కాకుండా అమీన్‌కు నరమాంస భక్షణ అలవాటు కూడా ఉండేదట. తన భార్యల్లో ఒక భార్యను చంపి ముక్కలు చేసి అతను తిన్నాడట. అయితే 8 సంవత్సరాల పాటు ఉగాండాలో రాక్షస పాలన కొనసాగించాక 1979లో అతను సౌదీ పారిపోయాడు. అక్కడే తన జీవితాన్ని అతను కొనసాగించాడు. అనంతరం 2003లో అమీన్ మరణించాడు. అమీన్ ఉగాండా నుంచి సౌదీకి పారిపోయాక అతని ఆధీనంలో ఉన్న ఆస్తులు, వ్యాపారాలను అతని బంధువులు పంచుకున్నారు. ఇదీ… ఒక క్రూరమైన రాక్షస పాలన కొనసాగించిన నియంత నేత చరిత్ర.