అమెరికాలో అల్లం టీ అమ్మి 227 కోట్ల సంపాధ‌న‌.!?

బాగా మ‌త్తుగా ఉన్న‌ప్పుడు, యాక్టివ్‌నెస్ లేకుండా ఉన్న‌ప్పుడు, త‌ల‌నొప్పి క‌లిగిన‌ప్పుడు.. వేడి వేడిగా క‌మ్మ‌ని అల్లం టీ ఒక‌టి తాగితే ఎలాంటి మ‌జా వ‌స్తుందో తెలుసు క‌దా. అలాంటి టీకి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయిపోతారు. అల్లం టీ అంటే తాగ‌ని వారు ఉండ‌రు. దాన్ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. అల్లం టీ అంటే అంద‌రికీ ఇష్ట‌మే. అయితే మ‌నం త‌యారు చేసే అల్లం టీకి ఆ అమెరికా మ‌హిళ ఫిదా అయిపోయింది. దీంతో ఆ టీని త‌న స్వ‌దేశంలో తాను ఉంటున్న ప్రాంతంలో త‌యారు చేసి అమ్మి కోట్ల‌ను గ‌డించింది. అయితే ఆమె స‌హ‌జంగానే సమాజ సేవ‌కురాలు కావ‌డంతో తాను అలా సంపాదించిన దాంట్లో చాలా భాగం వ‌ర‌కు విరాళంగా ఇచ్చేసింది. అది కూడా మ‌న భార‌త దేశంలో ఉన్న పేద‌ల కోస‌మే. ఆమె ఓ ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేసి మ‌రీ తాను అలా టీ అమ్మి సంపాదించిన దాంట్లోంచి ఇక్క‌డి పేద‌ల‌కు స‌హాయం చేస్తోంది.

ఆమె పేరు బ్రూక్ ఎడ్డీ. అమెరికాలోని కొల‌రాడో రాష్ట్రంలో ఉంటుందీమె. ఈమె 2002వ సంవ‌త్స‌రం అప్పుడు మ‌హారాష్ట్ర‌లో ఆరంభ‌మైన స్వాధ్యాయ్ ప‌రివార్ అనే కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఇండియాకు వ‌చ్చింది. ఈమె స్వ‌త‌హాగా సామాజిక సేవ‌కురాలు. అనేక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొని వాలంటీర్‌గా త‌న వంతు సేవ చేస్తుంటుంది. అయితే అలా ఇండియాకు వచ్చిన ఈమెకు మ‌న అల్లం టీ తెగ న‌చ్చేసింది. దీంతో త‌న సొంత దేశానికి వెళ్లాక తాను ఉంటున్న ప్రాంతంలో అల్లం టీని త‌యారు చేసి అమ్మ‌డం మొద‌లు పెట్టింది.

అలా బ్రూక్ ఎడ్డీ టీ త‌యారు చేయ‌డం ఏమో గానీ మ‌న అల్లం టీ అక్క‌డి దేశ వాసుల‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. దీంతో ఎడ్డీ వ్యాపారం బాగానే సాగింది. అలా ఆమె ఏకంగా టీ అమ్మ‌డం ద్వారా 35 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు (దాదాపుగా రూ.227 కోట్లు) సంపాదించింది. అంత సంపాదించినా ఆ మొత్తాన్ని ఆమె అట్టే త‌న ద‌గ్గ‌ర పెట్టుకోలేదు. తాను సమాజ సేవ చేస్తుంది క‌నుక GITA (Give, Inspire, Take Action) పేరిట ఓ ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా భార‌త్‌లో ఉన్న పేద‌ల‌కు స‌హాయం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బ్రూక్ ఎడ్డీ అలా తాను సంపాదించిన దాంట్లోంచి ఏకంగా 5 ల‌క్ష‌ల డాల‌ర్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టింది. గీతా సంస్థ ద్వారా ఆమె త‌న సంపాద‌న‌ను భార‌త్‌లోని పేద‌ల కోసం ఖ‌ర్చు చేస్తోంది. తాను ఇండియా నుంచి చాలా నేర్చుకున్నాన‌ని, అందుకే ఆ జ్ఞానం వ‌ల్ల వ‌చ్చిన డ‌బ్బును తిరిగి వారి బాగు కోస‌మే వాడుతున్నాన‌ని ఆమె గ‌ర్వంగా చెబుతోంది. ఆమె ఇలా చేస్తున్నందుకు మ‌నం ఆమెను క‌చ్చితంగా అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top