అమెరికా చేతిలో భారతీయుల ఆధార్ స‌మాచారం.!?

వంట గ్యాస్ స‌బ్సిడీ మొద‌లుకొని తాజాగా మొబైల్ నంబ‌ర్ల వ‌ర‌కు అనేక వాటికి మ‌నం ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నాం. దీంతో ఆయా సంస్థ‌ల‌కు మ‌న స‌మాచారం చేరుతోంది. అయితే మ‌రి ఆ స‌మాచారం చోరీకి గురైతేనో..? అంటే.. అందుకు అవ‌కాశం లేద‌ని ఇప్ప‌టికే uidai చెప్పింది. అయితే తాజాగా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం… భార‌తీయుల ఆధార్ డేటా అమెరికా చేతికి చిక్కింద‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. షాకింగ్ గా ఉంది క‌దూ. అమెరికాకు చెందిన గూఢ‌చారి సంస్థ CIA (అమెరికా సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ) ఇప్ప‌టికే భారతీయుల ఆధార్ డేటాను చోరీ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే ఇది ఎలా జ‌రిగి ఉంటుంది..? అనే అనుమానం క‌లుగుతోందా..! ఏమీ లేదండీ.. ప్ర‌జ‌ల ఆధార్ వివ‌రాల‌ను ఆన్‌లైన్ డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు క‌దా. అయితే ఆ డేటాబేస్‌కు చెందిన కొన్ని సాఫ్ట్‌వేర్ల‌ను అమెరికాకు చెందిన క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీ అనే సంస్థ డెవ‌ల‌ప్ చేసి మ‌న‌కు ఇచ్చింద‌ట‌. వాటిలో ముఖ్యంగా మ‌న బ‌యోమెట్రిక్ స‌మాచారానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ను ఈ కంపెనీ త‌యారు చేసింద‌ట‌. దీన్ని uidai ఇది వ‌ర‌కే తెలియ‌జేసింది. అయితే ఇదే కంపెనీ త‌యారు చేసిన కొన్ని టూల్స్ వ‌ల్ల అమెరికా CIA కు మ‌న ఆధార్ డేటా చేరింద‌ని తెలిసింది.

స‌ద‌రు క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీ సంస్థ డెవ‌ల‌ప్ చేసిన సాఫ్ట్‌వేర్ టూల్స్‌తో CIA ఆధార్ డేటాను సుల‌భంగా చోరీ చేయ‌వ‌చ్చ‌ని, అయితే ఈ ప్ర‌క్రియ ఎప్పుడో జ‌రిగి ఉంటుంద‌ని, ఇప్ప‌టికే భార‌తీయుల ఆధార్ స‌మాచారం అమెరికా CIA చేతికి వెళ్లి ఉంటుంద‌ని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా దీనిపై uidai అధికారులు స్పందించారు. క్రాస్‌ మ్యాచ్‌ టెక్నాలజీ డెవ‌ల‌ప్ చేసిన‌వి బ‌యోమెట్రిక్ టూల్స్ మాత్ర‌మే న‌ని వాటితో స‌మాచారం దొంగిలించ‌డం సాధ్యం కాద‌ని, భార‌తీయుల ఆధార్ స‌మాచారం చోరీకి గురి కాలేద‌ని, సేఫ్‌గానే ఉంద‌ని వారు అంటున్నారు. ఏమో.. అస‌లే అది ప్ర‌భుత్వ వెబ్‌సైట్ క‌దా. గ‌తంలో ఎన్నో ప్ర‌భుత్వ‌ సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. మ‌రిప్పుడు ఆధార్ సైట్ కూడా హ్యాకింగ్ కు గురి కాద‌ని గ్యారంటీ ఏమిటి. ఎప్పుడైనా ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు క‌దా. అందులోనూ అది ప్ర‌భుత్వ వెబ్‌సైట్ క‌దా. ఏమైనా జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top