అమీర్ ఖాన్ మాటలపై ట్విట్స్ దాడి చేసిన ప్రముఖులు.

అమీర్ ఖాన్. బాలీవుడ్ మిష్టర్ పర్ఫెక్ట్.. తనకు నచ్చిన పాత్ర కోసం, ఇష్టపడుతున్న అభిమానుల కోసం ఎలాంటి పాత్రలోనైనా 100% ఎఫర్ట్ పెట్టే నటుడు అమీర్ ఖాన్. ఈ మాటలన్నీ ఎప్పటికీ అమీర్ ను అభిమానించే ప్రతి ఒక్కరి మదిలోనూ ఉంటాయి. కానీ అమీర్ ఖాన్ నేడు అన్న మాటలు ప్రతి ఒక్కరిలో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. “నా భార్య ఈ దేశం వదిలి వెళ్లిపోదామని అంటోంది. మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ దేశం విడిచిపెట్టి వెళదాం” ట్విట్టర్ సాక్షిగా అమీర్ ఖాన్ అన్న మాటలివి. మన దేశంలో ప్రస్తుతం నడుస్తున్న అసహనం నేఫధ్యంలో అమీర్ ఖాన్ అన్న ఈ మాటలు ప్రతి ఒక్కరినీ హార్ట్ చేస్తున్నాయి. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అయ్యారు.

Aamir-Khan

రామ్ గోపాల్ వర్మ:

” అసలు భారత్ లో అసహనం ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదు. హిందూ దేశమైన భారత్ లో ముస్లింకు చెందిన ముగ్గురు కథానాయకులు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. మెజారిటీ ప్రజలు వారిని ఆదరిస్తున్నారు. ఇక అసహనం ఎక్కడుంది. ఏదో ఊహించుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా అన్నాడు.

మంచు విష్ణు:

“భారత్ గొప్ప దేశం. ఒక గొప్ప అమీర్ ఖాన్ ను భారత్ సృష్టించింది. మేమంతా  ఆప్ఘానిస్తులం కాదు, అసురక్షితమైన దేశంలో మీరున్నారని ఫీల్ అవడానికి. ఒక నటుడిగా ఎన్నో రికార్డులను అందుకున్న అమీర్ ఖాన్ నాకిష్టం” అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు.

అనుపమ్ ఖేర్
” నీ భార్య (అమీర్ భార్య కిరణ్ రావు) ఏ దేశానికి వెళదామందో తెలుసుకున్నావా? ఆమెకు చెప్పావ భారత్ నిన్ను,ఆమెను ఎంతటి స్టార్ ని చేసిందో అమీర్ ఖాన్” అని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ అమీర్ ట్వీట్లకు సమాధానంగా ఈ ప్రశ్నలు సంధించాడు.
పరేష్ రావెల్:
” హిందూ దేవుళ్ళపై సెటైర్ చేస్తూ అమీర్ పీకే సినిమా చేశాడని, ఆ దృష్టితో ఆలోచించకుండా, అసహనం చూపకుండా హిందువులు సినిమాను విజయవంతం చేశారని బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ అమీర్ ను ప్రశ్నించాడు.

Comments

comments

Share this post

scroll to top