తాజా పరిణామాల దృష్ట్యా, భార్యను కొన్ని రోజులు దేశం విడిచి వెళ్లిపోమని చెప్పిన అమీర్ ఖాన్!?

అమీర్ ఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ్. ఇంకా అమీర్ వ్యాఖ్యలపై వాడీవేడీ చర్చ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా మరో వార్త దీనికి తోడయ్యింది. తాజా పరిణామాల నేపథ్యంలో తన భార్య కిరణ్‌ను జాగ్రత్తగా ఉండమని అమీర్ సూచించినట్టు తెలుస్తోంది,  కుమారు అజాద్ ను తీసుకుని కొన్ని రోజుల పాటు ముంబై విడిచి వెళ్లిపొమ్మని చెప్పినట్లు వార్తలు వస్తున్నామయ్…  ఇదిలా ఉండగా మరో వైపు అమీర్ వ్యాఖ్యలపై  అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయ్. కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. అయితే కాంగ్రెస్, ఆప్ పార్టీలు మద్దతుగా నిలిచాయి.

amir (1)

సోషల్ మీడియా అయితే రెండుగా డివైడ్ అయ్యింది… అమీర్ కు అండగా కొందరు, అమీర్ కు వ్యతిరేఖంగా మరికొందరు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజా పరిణామాల దృష్ట్యా  అమీర్ భద్రతను పెంచారు. ఆయన నివాసం వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. అమీర్ ఖాన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తాను దేశం విడిచి వెళ్లబోనన్నారు. భారతీయుడిగా గర్విస్తున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు.

Comments

comments

Share this post

scroll to top