ఆమె చనిపోతూ ఆస్తి మొత్తం ఆ హీరో పేరున రాసింది..! ఎందుకో తెలుసా.? ఇంతకీ ఆ హీరో ఎవరు.?

సినిమా హీరోలు, హీరోయిన్ల ప‌ట్ల అభిమానులు చూపించే అభిమానం నిజంగా కొన్ని సార్లు వెర్రి త‌ల‌లు వేస్తుంది. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియ‌నంతగా ఆ అభిమానంలో ప‌డి కొట్టుకుంటారు. క‌న్న త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యుల‌ను అయినా అంతగా అభిమానిస్తారో లేదో తెలియ‌దు కానీ కొంద‌రు మాత్రం నిజంగా సెల‌బ్రిటీల ప‌ట్ల వెర్రి త‌ల‌లు వేసే అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. ఈ క్ర‌మంలోనే అలాంటి వీరాభిమానులు చేసే కొన్ని ప‌నులు అప్పుడ‌ప్పుడు మ‌న‌ల్ని షాక్‌కు గురి చేస్తాయి. ఆ మ‌హిళా అభిమాని కూడా త‌న హీరో ప‌ట్ల ఇలాంటి వెర్రి అభిమానాన్ని చూపించింది. అంద‌రూ ఊహించ‌ని ప‌ని చేసింది. దీంతో ఇప్పుడీ వార్త నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ముంబైకి చెందిన 62 ఏళ్ల నిషి హరిష్‌ చంద్ర త్రిపాఠి అనే మ‌హిళ‌కు బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే.. పైన ఆల్రెడీ చెప్పాం క‌దా.. వెర్రి త‌లలు వేసే ఇష్టం. దీంతో ఆమె త‌న కోట్ల ఆస్తిని హీరో సంజయ్‌ దత్‌ పేరిట రాసింది. జనవరి 15న అనారోగ్యంతో ఆమె కన్నుమూసింది. అయితే ఆమె చనిపోవడానికి కొన్ని నెలల ముందే తన ఆస్తంతా సంజయ్‌ దత్‌కు చెందేలా వీలునామా రాసింది. పాలీ హిల్స్‌లోని సంజయ్‌ దత్‌ అడ్రస్‌ను కూడా వీలునామాలో ఆమె తెలియ‌జేసింది. దీంతో నిషి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

అయితే మ‌రోవైపు న‌టుడు సంజ‌య్ ద‌త్ మాత్రం త‌న‌కు అభిమాని రాసిచ్చిన ఆస్తిని సున్నితంగా తిర‌స్క‌రించి త‌న హృద‌యాన్ని చాటుకున్నాడు. ఈ విష‌యంలో సంజ‌య్ ద‌త్ నిజంగా రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ఆస్తి మొత్తం నిషి కుటుంబ సభ్యులకే చెందేలా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూడాలని సంజయ్‌ తన తరఫు లాయర్‌కు సూచించాడు. అయితే అంత‌టి కోట్ల‌ ఆస్తి మొత్తాన్నితన పేరిట‌ రాయడం మాత్రం త‌న‌ను షాక్‌కు గురిచేసిందని సంజ‌య్ ద‌త్‌ తెలిపాడు. ఇక నిషి రాసిన ఆస్తులన్నీ ఆమె కుటుంబీకులకే చెందాలని తెలిపాడు. ఇందుకు త‌న‌వంతు స‌హాయం చేస్తాన‌ని, లీగల్‌గా హెల్ప్ చేస్తాన‌ని సంజ‌య్ ద‌త్ నిషి కుటుంబానికి హామీ ఇచ్చాడు. దీంతో నిషి కుటుంబ స‌భ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా.. ఇలా మ‌రీ వెర్రిగా ఎవ‌రినీ అభిమానించ‌కూడ‌దు. అది చివ‌ర‌కు ఎందాకైనా తెస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top