కిరాణా దుకాణాల‌తో అమెజాన్ ఒప్పందం

దేశంలో ఏ గ‌ల్లీకి వెళ్లినా అక్క‌డ టీ కొట్టు..కిరాణ కొట్టు ..సారా కొట్టు..వైన్స్ షాప్ వుండ‌నే ఉంటుంది. ఇప్పుడు ఇవ్వ‌న్నీ మామూలై పోయాయి. ఈ కామ‌ర్స్ రంగంలో దిగ్గ‌జ కంపెనీగా అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీకి మంచి పేరుంది. ఇప్ప‌టికే లాజిస్టిక్ ప‌రంగా ఈ కంపెనీ కోట్ల రూపాయ‌ల ఆదాయాన్ని గ‌డిస్తోంది. ఆసియా ఖండంలో అతి పెద్ద మార్కెట్ క‌లిగిన కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియానే. సూది నుంచి వాడుకునే అన్ని వ‌స్తువుల దాకా రిల‌య‌న్స్ కంపెనీ స‌ర‌ఫ‌రా చేస్తోంది. గృహోప‌క‌రాణ‌లు కూడా అంద‌జేస్తోంది. దేశ వ్యాప్తంగా ట్రెండ్స్ పేరుతో, రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్, రిల‌య‌న్స్ షాపులు, మాల్స్, అన్నీ ఒక దాని వెంట మ‌రొక‌టి ఏర్పాటు చేసుకుంటూ వ‌స్తోంది.

దేశ వ్యాప్తంగా అత్యంత బిగ్ నెట్ వ‌ర్క్ క‌లిగిన ఈ కంపెనీ చేయ‌ని వ్యాపారం అంటూ లేదు. మ‌రో వైపు ఐపీఎల్ టోర్నీలో సైతం స‌పోర్ట్ చేస్తోంది. కేవ‌లం కిరాణా కొట్టులు లేదా దుకాణాల ద్వారా రోజుకు కోట్లాది రూపాయ‌ల వ్యాపారం జ‌రుగుతోంది. ప్ర‌తి వారం జ‌రిగే సంత‌లు, ప్ర‌తి ఏటా ఒక‌సారి జ‌రిగే జాత‌ర్ల‌లో చిరు వ్యాపారులు త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువుల‌ను అమ్ముతున్నారు. పూట గ‌డుపుకుంటున్నారు. వీరాంతా సాదా సీదాగా బ‌స్సుల్లో లేదా ఆటోల్లో ప్ర‌యాణం చేస్తుంటారు. ప్ర‌తి పల్లెలో సంత‌లు అనేవి స‌ర్వ సాధార‌ణం. కూర‌గాయ‌ల నుండి ఇంట్లో వాడుకునే ప్ర‌తి వ‌స్తువు ఇక్క‌డ ల‌భిస్తుంది. వంట పాత్ర‌లతో పాటు తాజా కూర‌గాయ‌లు కూడా ఉంటాయి. ఏ ఒక్క‌టి లేద‌న‌డానికి వీల్లేదు. అంత‌లా విస్త‌రించాయి. ట్రెండ్ మారినా..కొత్త‌గా డిమార్ట్‌లు, మోర్‌, స్పెన్స‌ర్ వ‌చ్చినా జ‌నం త‌మ‌కు న‌చ్చిన వాటినే కొనుగోలు చేస్తున్నారు.

ఒక‌టి కొంటే మ‌రొక‌టి ఉచితం దొరుకుతుంద‌నే స‌రిక‌ల్లా అక్క‌డికి వాలిపోతున్నారు. ఒక‌ప్పుడు టీవీనో, ఫ్రిజ్‌, వాట‌ర్ ప్యూరిఫైర్, ఫ‌ర్నీచ‌ర్ , ఇంట్లోని వ‌స్తువులు కొనాలంటే ఎక్క‌డికో వెళ్లాలి. అక్క‌డి నుండి స్వంతంగా వెహికిల్ మాట్లాడుకుని ఇంటికి రావాల్సిన ప‌రిస్థితి ఉండేది. దీంతో కాలంతో పాటు కాసులు ఖ‌ర్చ‌య్యేవి. దీనిని గ‌మ‌నించిన ఈ కామ‌ర్స్ కంపెనీల‌న్నీ లేటెస్ట్ టెక్నాల‌జీని వాడుతున్నాయి. మ‌ధ్య ద‌ళారీల ప్ర‌మేయం లేకుండానే వ‌స్తువుల‌ను నేరుగా విక్ర‌యిస్తున్నారు. ఇక ఆన్ లైన్ వ్యాపారం ప‌ది వ‌స్తువులు..వంద మంది క‌స్ట‌మ‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. పై, రిల‌య‌న్స్, బ‌జాజ్ ఎల‌క్ట్రానిక్స్, ట్రెండ్స్, బిగ్ బ‌జార్ , సోనో విజ‌న్, ఇలా ప్ర‌తి చోటా అన్నీ అందుబాటులో ల‌భిస్తున్నాయి. అందుబాటు ధ‌ర‌ల్లో ల‌భిస్తున్నాయి. వినియోగ‌దారుల‌నే అన్ని కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయి. వారి అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు వ‌స్తువుల‌ను స్టోర్స్‌, మాల్స్‌ల‌లో ఏర్పాటు చేస్తున్నారు.

దీంతో ఈ కామ‌ర్స్ కంపెనీల పంట పండుతోంది. ఇక దుస్తుల బిజినెస్ డాల‌ర్ల‌ను కుమ్మ‌రిస్తోంది. ప‌చ్చ‌ళ్లు, తినుబండారాలు, స్వీట్లు, బిర్యానీలతో పాటు కావాల్సిన‌వ‌న్నీ కొనుగోలు చేసేందుకు క్యూ క‌డుతున్నారు. అమెజాన్ , ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ కంపెనీల‌తో పోటీ ఎదుర్కొంటోంది. ఇటీవ‌ల రిల‌య‌న్స్ త‌న వ్యాపారాన్ని కిరాణ దుకాణాల‌తో అనుసంధానం చేసుకోవాల‌ని అనుకుంటోంది. దీనిని గ‌మ‌నించిన అమెజాన్ ఇప్ప‌టికే ఆయా సెంట‌ర్ పాయింట్ల‌లో స‌ర్వీస్, డెలివ‌రీ పాయింట్ల‌ను ఏర్పాటు చేసింది. క‌మీష‌న్ బేసిస్ మీద కొంత మొత్తం పెట్టుబ‌డితో వారికి ఫ్రాంఛైజ్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తోంది. ఆయా గ్రామీణ‌, మండ‌ల ప్రాంతాల‌లో ఎక్కువ‌గా వీధి వీధికో కిరాణ దుకాణాలు ఉన్నాయి. వాటితోనే ఒప్పందం చేసుకుంటే త‌మ మార్కెట్‌ను మ‌రింత విస్త‌రించ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న‌తో అమెజాన్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. సో..మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. అది మారుతూనే ఉంటుంది. అమెజాన్ ఎంట‌ర్ కావ‌డంతో మిగ‌తా కంపెనీలు ఏ మేర‌కు రెస్పాండ్ అవుతాయో చూడాలి.

Comments

comments

Share this post

scroll to top