అమెజాన్ లో ఆవుపేడ ఆన్ లైన్ సేల్స్.. 4 పిడకలు 249/- రూ; మాత్రమే!! గోమూత్రం 80/-

ప్రస్తుతం మనకు కావాల్సిన ఏ వస్తువలైనా జస్ట్ ఒక్క లిక్ తో మనముందు వాలిపోతున్నాయి. ఈ-కామర్స్ బిజినెస్ ద్వారా ఆన్ లైన్ లో రోజుకు కొన్ని లక్షల వస్తువులు అమ్ముడుపోతుంటాయ్ . ఆన్ లైనే అడ్డాగా చేసుకొని ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, చెప్పులు ఇలా అన్ని రకాలు వస్తువులు అమ్ముతుంటారు. బుక్ చేస్తే చాలు ఐటమ్ తో  ఇంటి ముందుకు వచ్చి మన కాలంగ్ బెల్ కొడుతాడు డెలివరీ బాయ్స్..  అయితే ఇప్పుడు తాజాగా ఆవుపేడ కూడా ఆన్ లైన్ లో దొరుకుతుంది, . అది కూడా అమెజాన్ అనే అతిపెద్ద ఈ కామర్స్ లో..  ఆశ్చర్యంగా ఉందా..!ఇది అక్షరాల నిజం.

807676625

ఆవుపేడ, ఆ పేడతో చేసిన పిడకలు, గోమూత్రం…కూడా ఆన్ లైన్ లో సరసమైన ధరలకు లభిస్తున్నాయ్.. ప్రముఖ ఈ-కామర్స్ బిజినెస్ సంస్థ అమెజాన్ లో ఆవుపేడతో చేసిన  పిడకల రేట్లు ఇలా ఉన్నాయ్ .  4 పిడకలు రూ.249 కాగా, 8 పిడకలు రూ. 319 లు. కొనుగోలుదారులు వీటికి 4.4/5 గా రేటింగ్ ఇస్తున్నారు.  పండుగల వేళల్లో పట్టణ ప్రాంతాలలో ఈ పిడకలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారట. ఆవు పేడను, గోమూత్రాన్ని పవిత్రంగా పూజించే మనదేశంలో పల్లెలలో ఎలాగు దొరుకుతాయి కాబట్టి, సిటీలలో వీటికి డిమాండ్ ఎక్కువట. గోమూత్రాన్ని ఒక బాటిల్ లో నింపి దీని ధర రూ. 80 లుగా నిర్ణయించి, దీనికి 4.1/5 రేటింగ్ ఇచ్చారు. వీటిలో ఆఫర్స్ కూడా ఉన్నాయండోయ్.

807676625

633442603

Comments

comments

Share this post

scroll to top