అమెజాన్ డెలివరీ తీసుకున్న తర్వాత వచ్చిన మెసేజ్ చూసి అతను షాక్ అయ్యాడు..! ఎందుకో తెలుసా.?

ఒక రూపాయి పెడితే ఈ రోజుల్లో ఏం వస్తుంది ? రూ.1కి మీరు ఏ వస్తువును కొంటారు. బాగా ఆలోచించండి. పిల్లలు తినే చిన్నపాటి చాక్లెట్స్‌, బిస్కట్స్‌, తినుబండారాలు, పెద్దలకు సోంపు, పాన్‌ మసాలా ప్యాకెట్లు వస్తాయి. అంతకు మించి ఏమీ రావు కదా. అయినా రూపాయి రూపాయే కదా. అలా అని చెప్పి మనకు ఎవరి వద్ద నుంచైనా రూపాయి రావల్సి ఉంటే వదులుకోం కదా. తగాదా పెట్టుకుని మరీ వసూలు చేస్తాం. అవును మరి. ఎంతైనా మన డబ్బు కదా. కష్టపడి సంపాదించింది, కనుక ఒక్క రూపాయిని కూడా వదులుకోం. వదులుకునేందుకు ఇష్టపడం. నేటి తరుణంలో ఎవరైనా ఇదే చేస్తున్నారు. అయితే ఆ యువకుడు మాత్రం రూ.1 వదులుకున్నాడు. ఆ రూపాయి రాదనే అనుకున్నాడు. కానీ తాను వదులుకున్న రూపాయి తన వద్దకు మరో రూపంలో వచ్చింది. దీంతో అతను షాక్‌ తిన్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

అతని పేరు సత్పాల్‌ సింగ్‌ రాథోడ్‌. విద్యార్థి. అమెజాన్‌లో ఓ ట్రావెల్‌ బ్యాగ్‌కు ఆర్డర్‌ ఇచ్చాడు. దాని ధర రూ.1979. క్యాష్‌ ఆన్‌ డెలివరీ కావడంతో డెలివరీ అతనికి రూ.2వేలు ఇవ్వగా అతను రూ.20 ఇచ్చాడు. మిగిలిన ఒక్క రూపాయి సత్పాల్‌కు రావల్సి ఉంది. కానీ డెలివరీ అతను ఆ రూపాయిని ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. అతని వద్ద రూపాయి చిల్లర లేదేమోలే అనుకుని సత్పాల్‌ తన రూపాయిని వదులుకున్నాడు. అయితే అతనికి మరికొద్ది నిమిషాల్లో ఆ రూపాయి వచ్చింది.

సత్పాల్‌ అమెజాన్‌ అకౌంట్‌లో ఉండే అమెజాన్‌ పే బ్యాలెన్స్‌లో ఆ రూపాయి జమ అయింది. అలా అతని ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో అతను షాక్‌ తిన్నాడు. అంటే తన వద్ద తీసుకున్న ఆ రూ.1ని డెలివరీ అతను తీసుకోలేదన్నమాట. కంపెనీకి ఇచ్చాడు. దీంతో కంపెనీ ఆ ఛేంజ్‌ను తన అమెజాన్‌ పే అకౌంట్‌లో జమ చేసింది. అందుకు గాను తనకు మెసేజ్‌ వచ్చింది. జరిగిందది. దీంతో సత్పాల్‌ షాక్‌ అయ్యాడు. తన రూపాయి తనకు వచ్చిందని చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్‌ చేశాడు. అవును మరి, ఎంతైనా కష్టపడి సంపాదించిన డబ్బు కదా. రూపాయైనా సరే ఎలా వదులుకుంటాం చెప్పండి. నిజమే కదా..!

Comments

comments

Share this post

scroll to top