అమెరికన్ పెప్సికో కంపెనీకి సిఇఓగా పనిచేసి ..పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రముఖ భారతీయురాలు ..సక్సెస్ ఫుల్ సిఇఓగా పేరు తెచ్చుకున్న ఇంద్రా నూయి మరో అమెరికన్ కంపెనీ..కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అధికారిగా పేరు తెచ్చుకున్నారు. పెప్సీకో కంపెనీని లాభాల బాట పట్టించారు. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లో దానిని టాప్ టెన్‌లో ఒకటిగా నిలిపారు. అనుకోకుండా ఆ కంపెనీ నుండి వైదొలిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత కాలం మౌనంగా ఉన్నారు. 28 అక్టోబర్ 1955లో జన్మించిన నూయి ఎక్కని ఎత్తు పల్లాలు లేవు. 2014లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ, పవర్ ఫుల్ ఉమెన్స్ కేటగిరీలో 100 మందిని ఎంపిక చేశారు. అందులో 13వ స్థానంలో మన ఇంద్రా నూయి ఉన్నారు.
ఫార్చూన్ 2015లో ప్రకటించిన జాబితాలో వరల్డ్ వైడ్ గా చూస్తే రెండో స్థానంలో నిలిచారు. సిఇఓగా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహించడంతో..ప్రపంచంలోనే అత్యంత లిక్విడ్ కలిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ ఫిమేల్ డైరెక్టర్‌గా 2018 ఫిబ్రవరిలో ఎంపికయ్యారు. ఒక మహిళ ఇండిపెండెంట్ డైరెక్టర్ కావడం ఇదే ప్రథమం. ఆమె స్వస్థలం మదరాసు. టి నగర్‌లోని హోలి ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివారు. మద్రాస్ క్రిష్టియన్ కాలేజీలో డిగ్రీ చేశారు. కోల్‌కతాలో ఐఐఎంలో డిప్లొమా చేశారు. యాలే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పబ్లిక్ ప్రైవేట్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ సాధించారు. మొదటగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా జాయిన్ అయ్యారు. స్ట్రేటజీ కన్సల్టెంట్‌గా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లో పనిచేశారు. మోటారోలా కంపెనీలో డైరెక్టర్‌గా ..వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1994లో ప్రపంచంలోనే పేరుగాంచిన పెప్సికో కంపెనీలో చేరారు.
2001లో ఆ కంపెనీకి సిఇఓగా నూయిని డిక్లేర్ చేసింది. 44 ఏళ్ల పెప్సికో కంపెనీ చరిత్రలో ఒక మహిళను సిఇఓగా ఎంపిక చేయడం ఇదే ప్రథమం. ఆమె పదేళ్ల పాటు కంపెనీలో పనిచేశారు. అత్యుత్తమమైన కంపెనీగా తీర్చిదిద్దారు. ఆదాయం పెంపొందించేలా చేశారు. నెట్ ప్రాఫిట్ పరంగా 2 7 బిలియన్ల నుండి 6.5 బిలియన్ల దాకా తీసుకు వచ్చింది నూయి. 2007 – 2008లో అమెరికన్ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించిన 50 మంది జాబితాలో నూయి కూడా ఒకరు. అదే ఏడాది టైమ్స్ ప్రకటించిన శక్తివంతమైన మహిళల్లో ఇంద్రా చోటు దక్కించుకున్నారు. పెప్సికోను అన్ని దేశాల సంస్కృతి ..సంప్రదాయాలను గౌరవించేలా డ్రింక్స్‌తో పాటు ప్రొడక్ట్స్‌ను పరిచయం చేశారు. 2018 ఆగష్టు 6న నూయి స్థానంలో రోమన్ లాగ్వార్తాను నియమించింది పెప్సికో యాజమాన్యం. 2019 దాకా చైర్ వుమెన్‌గా పనిచేశారు. ఆమె హయాంలో పెప్సికో ఉత్పత్తులు 80 శాతానికి మించి అమ్ముడు పోయాయి. ఇది ఓ రికార్డు .
సిఇఓగా ఆమె 12 ఏళ్ల పాటు సేవలందించారు. 2011లో సిఇఓగా ప్రమోట్ అయిన నూయి..వేతనాల పరంగా 17 మిలియన్లు పోగేసుకున్నారు. బేసిక్ సాలరీ 1.9 మిలియన్స్. క్యాష్ బోనస్ కింద 2.5 మిలియన్స్ పొందారు. పెన్షన్ పరంగా చూస్తే 3 మిలియన్స్ ఇచ్చారు. 2014 వరకు ఆమె వేతనాలు, ఇతర సౌకర్యాల పరంగా అందుకున్న డబ్బులు ..తెలుసుకుంటే కళ్లు చెదిరిపోతాయి. 19, 08, 7382 డాలర్ల్స్ ఆమె అందుకున్న మొత్తం. సిఇఓగా ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరించాయి. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ..అమెరికా బెస్ట్ లీడర్స్‌లో ఒకరిగా నూయిని పేర్కొన్నారు. అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఫెలోషిప్ పొందారు. 2008లో యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్‌కు చైర్ ఉమెన్‌గా ఎన్నికయ్యారు. యుఎస్ఐబీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరుగా ఉన్నారు.
2009లో బెస్ట్ సిఇఓగా గ్లోబల్ సప్లయి చైన్ లీడర్స్ గ్రూపు ఎంపిక చేసింది. బ్రెండన్ వుడ్ ఇంటర్నేషనల్ సంస్థ 2009లో ద టాప్ గన్ సిఇఓగా నూయిని సత్కరించింది. 2013లో ఎన్డిటీవీ 25 మంది గ్రేటెస్ట్ గ్లోబల్ లివింగ్ లెజెండ్స్‌లో నూయిని ఒకరిగా ఎంపిక చేసింది. 2008 – 2011 వకు ఆల్ అమెరికా ఎగ్జిక్యూటివ్ టీమ్ సర్వేలో బెస్ట్ సిఇఓగా ఇంద్రా నూయిని ప్రకటించింది. 2007లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది కేంద్ర సర్కార్. ఎనిమదికి పైగా యూనివర్శిటీలు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. అమెజాన్ నూయిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎంపిక చేయడం అంటే తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం అన్నమాట. ఇది మహిళకు దక్కిన గౌరవంగా భావిస్తే తప్పే అవుతుంది..ఇది భారతీయులందరికి లభించిన గౌరవంగా భావించాలి.