మీకు తెలియ‌ని 7 సీక్రెట్స్.!!

నిత్య జీవితంలో మ‌నం చాలా విష‌యాల‌ను చూస్తుంటాం. వాటిలో కొన్ని వ‌స్తువులైతే, కొన్ని అంకెలు, సింబ‌ల్స్ అయి ఉంటాయి. ఇంకొన్ని వేరేవి అయి ఉంటాయి. అయితే సాధార‌ణంగా చాలా మంది దేన్న‌యినా అంత‌గా ప‌ట్టించుకోరు. అలా చూస్తూ వెళతారు. అయితే బాగా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే కొన్ని వ‌స్తువుల ద్వారా మ‌న‌కు కొన్ని విష‌యాలు తెలుస్తాయి. అవేమిటంటే…

1. కాస్మొటిక్స్ జార్‌
కాస్మొటిక్స్ ఉండే జార్ లేదా డ‌బ్బాల‌పై మీరెప్పుడైనా 12 M అని లేదా 12 W అని చూశారా..? చూసే ఉంటారు. కానీ వాటి గురించి ప‌ట్టించుకుని ఉండ‌రు. అయితే వాటి వ‌ల్ల మ‌న‌కు ఏం తెలుస్తుందంటే… 12 M అని ఉంటే ఆ కాస్మొటిక్ 12 నెల‌ల పాటు పాడు కాకుండా ఉంటుంద‌ని అర్థం. M అంటే month అని అర్థం. అలాగే W అంటే Week అని అర్థం. అంటే ఆ కాస్మొటిక్ ఎక్స్‌పైరీ అన్ని నెల‌లు లేదా వారాలు ఉంటుంద‌న్న‌మాట‌.

2. రంగుల్లో ఉండే టూత్ పేస్ట్‌
టూత్‌పేస్ట్‌ల‌ను త‌యారు చేసే కంపెనీలు కొన్ని ర‌కాల పేస్ట్‌లను రంగు రంగులుగా త‌యారు చేస్తాయి. అయితే ఆ రంగుల వ‌ల్ల మ‌న‌కు ఓ విష‌యం తెలుస్తుంది. అదేమిటంటే.. ఎరుపు రంగు పేస్ట్‌లో ఉంటే అది చిగుళ్ల‌ను దృఢంగా చేస్తుంద‌ని, తెలుపు రంగులో ఉంటే అది దంతాల‌ను తెల్ల‌గా చేస్తుంద‌ని, ఇక గ్రీన్ లేదా బ్లూ రంగుల్లో ఉంటే ఆ పేస్ట్ వ‌ల్ల నోటి దుర్వాస‌న ఉండ‌ద‌ని, తాజా వాస‌న వ‌స్తుంద‌ని తెలుసుకోవాలి. అందుకే ఈ మూడు రంగులు క‌లిసి వ‌చ్చేలా కొన్ని కంపెనీలు టూత్ పేస్ట్‌ల‌ను త‌యారు చేస్తున్నాయి.

3. స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీ
అమెరికాలో ఉండే స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీ అంద‌రికీ తెలిసిందే. ఎత్త‌యిన విగ్ర‌హమది. అయితే ఆ విగ్ర‌హం త‌ల‌కు ఉండే పాగాకు 7 కొమ్ముల వంటివి ఉంటాయి. అవి భూమిపై ఉన్న 7 ఖండాల‌ను, 7 మ‌హాస‌ముద్రాల‌ను సూచిస్తాయి. ఇక వాటిలో ఒక్కో కొమ్ము బ‌రువు 150 పౌండ్ల వ‌ర‌కు ఉంటుంది. అంటే సుమారుగా ఒక్కొక్కటి 68 కిలోల వ‌ర‌కు బ‌రువు ఉంటుంద‌న్న‌మాట‌.

4. జిగ్ జాగ్ ట్రామ్
మీకు ట్రామ్ కార్ల గురించి తెలుసు క‌దా. అదేనండీ మ‌న దేశంలో కోల్‌క‌తాలో ఉన్నాయి. రోడ్ల‌పై ఉండే ప‌ట్టాల‌పై అవి తిరుగుతాయి. రెండు లేదా మూడు పెట్టెలు మాత్రమే ఉంటాయి. వీటినే ట్రామ్ కార్లు అని పిలుస్తారు. అయితే ఇవి ఎప్పుడూ స్ట్రెయిట్‌గా ప్ర‌యాణించ‌వు. జిగ్ జాగ్ గా అంటే వంక‌ర టింక‌ర‌గా ప్ర‌యాణిస్తాయి. అది ఎందుకంటే వాటి క‌ప్పుపై ఉండే పాంటోగ్రాఫ్ స‌రిగ్గా బ్యాలెన్స్ అవ్వాలంటే అవి అలా ప్ర‌యాణించాల్సిందే.

5. కింగ్ హార్ట్స్
పేక‌ల్లో ఉండే హార్ట్స్ కింగ్ (ఆఠీన్ రాజు) గురించి తెలుసు క‌దా. అయితే ఆ బొమ్మ నిజ‌మైన రాజుదే తెలుసా..? అత‌ని పేరు కింగ్ చార్లెస్ VII. అయితే అత‌ను త‌న క‌త్తితో త‌ల‌లో పొడుచుక‌ని చ‌నిపోయాడ‌ట‌. అందుకే ఆ పేక‌ల్లో బొమ్మ కూడా అలాగే ఉంటుంది, క‌త్తితో త‌ల‌ను పొడుచుకున్న‌ట్టుగా ఉంటుంది.

6. ఖాళీ పేజీలు
పుస్త‌కాల్లో మ‌నం అప్పుడ‌ప్పుడు ఖాళీ పేజీల‌ను చూస్తాం క‌దా. అయితే వాటిని ఎందుకు అలా వ‌దిలిపెడ‌తారంటే అన్నీ పేజీలు క‌లిపి స‌రిసంఖ్య‌లో ఉండాల‌నే కార‌ణం చేత కొంద‌రు అలా పుస్త‌కాల‌ను ఖాళీ పేజీల‌తో ప్రింట్ చేస్తార‌ట‌. అందుకే అవి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌నిపిస్తాయి. దానికి గ‌ల కార‌ణం అదే.

7. బ్రిట‌న్ కాయిన్లు
బ్రిట‌న్ దేశానికి చెందిన 1, 2, 5, 20, 50 పెన్స్ కాయిన్ల‌ను వ‌రుస‌గా పెడితే అవి అక్క‌డి రాయ‌ల్ కోట్ ఆఫ్ ఆర్మ్స్‌ను పోలేలా ఆకారం ఏర్ప‌డుతుంది.

Comments

comments

Share this post

scroll to top