అల్లు అర్జున్ సైనికుడిగా నటించిన “నా పేరు సూర్య” హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్(తెలుగులో).!

Movie Title (చిత్రం): నా పేరు సూర్య (Naa Peru Surya)

Cast & Crew:

నటీనటులు: అల్లు అర్జున్‌, అను ఇమ్మాన్యుయేల్‌, అర్జున్‌, శ‌ర‌త్‌కుమార్‌, న‌దియా, బోమ‌న్ ఇరాని, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌దీప్ రావ‌త్‌, రావు ర‌మేశ్ త‌దిత‌రులు
దర్శకత్వం: వ‌క్కంతం వంశీ
సంగీతం: విశాల్ -శేఖ‌ర్‌
నిర్మాత: ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్‌ (శ్రీ రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్‌)

Story:

సూర్య (అల్లు అర్జున్‌) నిజాయ‌తీ గ‌ల సైనికుడు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వ‌డానికి కూడా వెన‌కాడ‌డు. ఎదుటివారు చిన్న త‌ప్పు చేశార‌ని తెలిసినా త‌ట్టుకోలేడు. హెడ్ క్వార్ట‌ర్స్ నుంచి బోర్డ‌ర్‌కి వెళ్లాల‌నేదే సూర్య ఉద్దేశం. అందుకోసం క‌ష్ట‌ప‌డుతుంటాడు. కానీ సైనిక నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఒక‌సారి ఓ ఉగ్ర‌వాదిని కాల్చి చంపేస్తాడు. అదే అద‌నుగా తీసుకున్న క‌ల్న‌ల్ (బోమ‌న్ ఇరాని) అత‌న్ని ఆర్మీ నుంచి బ‌య‌టికి పంపించేస్తాడు. అందుకు అంగీక‌రించ‌ని సూర్య త‌న గాడ్ ఫాద‌ర్ (రావు ర‌మేశ్‌)ను సంప్ర‌దిస్తాడు. అంద‌రూ క‌లిసి వైజాగ్‌లో ఉన్న ర‌ఘురామ‌కృష్ణంరాజు (అర్జున్‌) అనే సైక్రియాట్రిస్ట్ ద‌గ్గ‌రకు వెళ్లి ఓ స‌ర్టిఫికెట్ తీసుకుని ర‌మ్మ‌ని చెబుతారు. దాంతో వైజాగ్‌కి వ‌స్తాడు సూర్య. అత‌నికి వ‌ర్ష (అను ఇమ్మాన్యుయేల్‌) తార‌స‌ప‌డుతుంది. ఆమెతో సూర్య ప్రేమ‌లో ప‌డ‌తాడు. అత్యంత కోపంతో తిరిగే సూర్య 21 రోజుల్లోనే మారాడా? అత‌న్ని ర‌ఘురామ‌కృష్ణంరాజు ఎలా మార్చాడు? అత‌నికి, సూర్య‌కి ఉన్న సంబంధం ఏంటి? సూర్య త‌న గోల్‌ని రీచ్ అయ్యాడా? లేదా అనేది మిగిలిన క‌థ‌.

Review:

అల్లు అర్జున్‌ క్యారెక్టర్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన తీరు బావుంది. అంతే లెవల్‌లో బన్ని ఆ క్యారెక్టర్‌ను క్యారీ చేసిన తీరు అద్భుతంగా ఉంది. యాంగర్‌ మేనేజ్‌మెంట్‌ తెలియని సోల్జర్‌.. కొన్ని కారణాల రీత్యా కోపాన్ని చూపించకుండా 21 రోజుల పాటు ఉండే పాత్రలో బన్ని చక్కగా ఒదిగిపోయాడు. అలాగే ఫస్ట్‌ సీన్‌ నుండి ఫైట్స్‌, డాన్సుల పరంగా బన్ని క్యారెక్టర్‌ను అద్భుతంగా పండించాడు. ఇప్పటి వరకు చేసిన పాత్రలకంటే డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో బన్ని నటన ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఇక హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ పాత్ర గ్లామర్‌, పాటలకు మాత్రమే పరిమితం. ఆమె పాత్రలో పెర్ఫామెన్స్‌కు పెద్దగా స్కోప్‌ లేదు. ఇక సీనియర్‌ హీరో అర్జున్‌ సైకాలజీ ప్రొఫెసర్‌గా అతికినట్టు సరిపోయారు. ఇప్పటి వరకు అర్జున్‌ చేయనటువంటి తండ్రి పాత్ర ఇది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో, ఇంటర్వెల్‌ ముందు బన్నితో చేసే డిస్కషన్స్‌ సీన్స్‌లో అర్జున్‌ తనదైన అనుభవాన్ని జోడించి చక్కగా నటించారు. ఇక హీరో శరత్‌కుమార్‌ విలనిజాన్ని ప్రారంభంలో చూపినట్లు చివరి వరకు మెయిన్‌టెయిన్‌ చేయలేకపోయారు. సెకండాఫ్‌లో ముస్తఫా అనే రిటైర్డ్‌ మిలటరీ సైనికుడి పాత్రలో సాయికుమార్‌ నటన బావుంది. ఇక నదియా, వెన్నెలకిశోర్‌, హరీశ్‌ ఉత్తమన్‌, బోమన్‌ ఇరానీ, రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, అన్వర్‌ అనే కుర్రాడి పాత్రలో నటించిన లగడపాటి శ్రీధర్‌ తనయుడు అందరూ వారి వారి పాత్రల పరంగా చక్కగా నటించారు.

దర్శకుడు వక్కంతం వంశీ డెబ్యూ మూవీ ఇది. ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ను అనుకుని దాని చుట్టూ కథ అల్లాడు. ఒక పక్క దేశభక్తి, హీరోయిజమ్‌, లవ్‌ ట్రాక్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్ని విషయాలను పక్కాగా సమకూర్చుకున్నాడు. అయితే ఇది ప్రీ క్లైమాక్స్‌ వరకు బాగానే ఉంది. కానీ అక్కడి నుండి సినిమా ఊపు ఒక్కసారిగా డౌన్‌ అయిపోయింది. ఫ్లాట్‌గా సినిమాకు ముగింపు ఇవ్వడం కామన్‌ ఆడియెన్‌కు నచ్చదు. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్‌ వరకు హీరో, విలన్‌ క్యారెక్టర్స్‌ మొత్తం తర్వాత నీరుగారిపోయాయి. హీరో క్యారెక్టర్‌ను దర్శకుడు డిజైన్‌ చేసుకున్న తీరులో ముగింపు ఇచ్చినా ఇంతకు ముందు చెప్పినట్లు అభిమానులకు, కామన్‌ ఆడియెన్‌ ఊహించినంత లేకపోవడం సినిమాకు మైనస్‌ అవుతుంది. ఇక రాజీవ్‌ రవి సినిమాటోగ్రఫీ బావుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో చాలా బావున్నాయి. స్టార్టింగ్‌లో పోలీస్‌ స్టేషన్‌లో వచ్చే ఫైట్‌, ఇంటర్వెల్‌ ఫైట్‌, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ అన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయి.

Plus Points:

అల్లు అర్జున్‌ నటన
ఫైట్స్‌
ఫస్టాఫ్‌
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

Minus Points:

క్లైమాక్స్‌
బలమైన విలన్‌గా చివర్లో ఎందుకు కొరగానివాడిలా చూపించడం

Final Verdict:

నా పేరు సూర్య.. ల‌క్ష్యం కోసం పోరాడే సైనికుడు

AP2TG Rating:  3.5 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top