సోషల్ మీడియాలో అల్లు అర్జున్ క్యాప్ డ్యాన్స్ వైరల్ గా మారింది. సినిమా విడుదలకు ముందే….సినిమాకు కావాల్సినంత క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టింది ఈ డాన్స్.! వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కించబడ్డ …నాపేరు సూర్య సినిమాలోని ఐయామ్ లవర్ ఆల్సో…ఫైటర్ ఆల్సో…అనే పాటకు బన్నీ స్టెప్స్…క్యాప్ తో చేసిన ఫీట్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి…సాధారణంగా డాన్స్ ను ఓ రేంజ్ లో కుమ్మేసే…స్టైలిష్ స్టార్..ఈ పాటకు క్యాప్ తో కూడా స్టెప్పులేయించాడు.!
ఈ పాటలో అల్లు చేసిన క్యాప్ ఫీట్స్ …గ్రాఫిక్స్ అని చాలా పుకార్లు వచ్చాయి..కానీ వాటిని బ్రేక్ చేస్తూ….క్యాప్ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో విడుదల చేశారు.! ఈ వీడియోలో క్యాప్ ఫీట్స్ కోసం అల్లు చేసిన ప్రాక్టీస్, హార్డ్ వర్క్ మనకు కనిపిస్తాయి. ఇక ఈ పాటను కొరియోగ్రఫి చేసింది రాజీవ్ రవి అనే డ్యాన్స్ మాస్టర్ … కేరళకు చెందిన ఈ కొరియోగ్రాఫర్ హిందీలో అనేక సినిమాలకు వర్క్ చేశాడు…తెలుగులో ఇదే అతని ఫస్ట్ మూవీ.!
Allu Cap Dance:
Allu Arjun cap dance practice!! Naa Peru Surya Behind scene: