వీరమాచినేని డైట్ అనారోగ్యకరమా..? డాక్టర్లేమంటున్నారు..? తప్పక తెలుసుకోండి..!

బరువు తగ్గడానికి మనం నోరు కట్టేసుకుని కూర్చుంటాం కాని మనం తినాలనుకున్నవి తినొచ్చు.. కొవ్వుకు కొవ్వుతోనే చెక్ పెట్టాలని చెప్తూ అధిక బరువుని తగ్గించుకోవడానికి సరికొత్త డైట్ ని ప్రవేశపెట్టారు వీరమాచినేని రామకృష్ణారావు.. అంతేకాదు ఆ డైట్ తో డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవెల్ కూడా తగ్గుతాయని చెప్తున్నారు..అయితే ఇది కీటో డైట్ అని దీనివలన నష్టాలుంటాయంటున్నారు డాక్టర్లు.అంతేకాదు దీనిపై బాబు గోగినేని స్పందించారు..కీటో డైట్ అంటే ఏంటి.. డాక్టర్లు ఏమంటున్నారు..బాబుగోని ఏమని స్పందించారు..

diet-plan

కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు మార్కెట్లో ఏది కొత్తగా కనపడితే దాని వెంట పడడం జనాల వంతు..గతంలో మంతెన సత్యనారయణరాజు చెప్పే డైట్ ని రెగ్యులర్ గా ఫాలో అయిన ప్రేక్షకులున్నారు.ఇప్పుడు మంతెనగారు పోయి ఆ ప్లేస్ ని వీరమాచినేని రామకృష్ణ భర్తీ చేశారు..ఆయన చెప్పిన డైట్ ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు,విదేశాల్లో కూడా వేల సంఖ్యలో ఫాలో అవుతున్నారు.ఒక్కసారిగా సోషల్ మీడియాలో వీరమాచినేని గారు,అతని డైట్ చర్చనీయాంశం అయ్యాయి..తన అధిక బరువుని తగ్గించుకోవడానికి ఒక నిర్ధిష్ట డైట్ ఫాలో అయిన వీరమాచినేని మంచి రిజల్ట్ కనపడడంతో అదే డైట్ ని తన ఫ్రెండ్ పై ప్రయోగించారు.అప్పుడు కూడా రిజల్ట్ పాజిటివ్ రావడంతో ఇప్పుడు ఎంతో మంది అదే డైట్ ని ఫాలో అవుతున్నారు..అయితే వీరమాచినేని చెప్పే డైట్ కీటో డైట్ కి దగ్గరగా ఉందంటున్నారు డాక్టర్లు.

కీటోడైట్ అంటే ఏంటి??

సాధారణంగా మన శరీరం కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం నుంచి ఉత్పత్తయ్యే గ్లూకోజ్ నుంచి శక్తిని పొందుతుంది. అదే గ్లూకోజ్ లేని సందర్భంలో కీటోసిస్ జరుగుతుంది. కీటోసిస్‌లో భాగంగా శక్తి కోసం శరీరం గ్లూకోజ్ బదులుగా కొవ్వు పదార్థాలను కరిగించుకుంటుంది. మనం కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే, కాలేయం కొవ్వును కరిగించి, దాని నుంచి శక్తిని పొందుతుంది. ఈ శక్తి ‘కీటోన్’ అనే కణాల రూపంలో ఉంటుంది.తక్కువ కార్బోహైడ్రేట్ల ద్వారా శరీరాన్ని ‘కీటోసిస్’ అనే స్థితికి పంపడమే ఈ కీటో డైట్‌ లక్ష్యం.తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహార పదార్దాలను తీసుకోవడమే కీటోడైట్..ఇదే సూత్రాన్ని వీరమాచినేని అవలంభిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.

డాక్టర్లేమంటున్నారు??

కీటో డైట్ వలన దుష్ప్రభవాలు తప్పవని..చాలామంది బరువు తగ్గడానికి కీటోడైట్ ఫాలో అవుతారిన అందరిలోనూ అవే రిజల్ట్స్ ఉండకపోవచ్చని అంటున్నారు.అది మధుమేహ వ్యాధి ఉన్న రోగులలో ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచే అవకాశం ఉంది. నిజానికి లో-ఫ్యాట్ డైట్‌తో పోలిస్తే కీటోజెనిక్ డైట్ దీర్ఘకాలంలో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అయితే మీ శరీరం ఏ మేరకు కీటోజెనిక్ డైట్‌కు అనుగుణంగా స్పందిస్తుందనేదానిపై ఇది ఆధారపడుతుంది అని అంటున్నారు..దీనిపై బాబు గోగినేని,ఇతర డాక్టర్ల స్పందన ఏంటో మీరే చూడండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top