150 ఏళ్ల తర్వాత మరికాసేపట్లో అద్భుతం..! అసలు సూపర్, బ్లూ, బ్లడ్ మూన్ మధ్య తేడా ఏమిటి? ఎలా ఏర్పడుతుంది?

మరికాసేపట్లో ఆకాశంలో అద్బుతం జరగనుంది.సుమారు 150ఏండ్ల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.. దీనిని “SUPER – BLUE- BLOOD MOON ” పేరుతో పిలుస్తారు..ఇప్పటికే ఈ చంద్ర గ్రహణం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. .ఇంతకీ ఈ బ్లూ,బ్లడ్ మూన్ అంటే ఏంటి?  ఆ పేర్లెందుకొచ్చాయి..వివరంగా మీకోసం…!

SUPER MOON:

చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్య లో తిరుగుతూ ఉండటం వలన ఒకానొక సమయంలో భూమికి చాలా దగ్గరకు వస్తాడు. అందువలన చంద్రుని సైజు పెరిగి పెద్దది గా కనిపిస్తుంది. 31వతేదీన ఇలాగే చంద్రుని సైజు 14% పెద్దదిగా కనిపిస్తుంది. ఇలా పెద్ద గా కనిపించే చంద్రుని బింబాన్ని సూపర్ మూన్ అంటారు.

BLUE MOON :

 నిజానికి ఇది పొరపాటున పెట్టిన పేరు. ఇందులో బ్లూ రంగు ఏమీ లేదు. ఒకే నెలలో రెండు పౌర్ణమి (Full moon) వస్తే దాన్ని శాస్త్ర వేత్తలు blue moon గా పిలుస్తారు. కాలెండరు ను గమనిస్తే జనవరి 2వ తేదీన ఒకసారి పౌర్ణమి వచ్చిన విషయం మళ్ళీ జనవరి 31వతేదీన రెండవసారి పౌర్ణమి రావటం తెలిసిపోతుంది.

BLOOD MOON:

సంపూర్ణ చంద్ర గ్రహణం వలన చంద్రుని మీద డైరెక్ట్ గా సూర్య కిరణాలు పడక పోవటం వలన చంద్రుడు ప్రకాశవంతంగా, తెల్లగా ఉండడు. కానీ భూమి పై పడిన సూర్య కిరణాలు భూమి వాతావరణంలో లోని ధూళి,నీరు వలన పరావర్తనం,వికిరణం చెంది వాటిలోని ఎరుపురంగులో కిరణాలు భూమి అంచులనుంచి పోయి చంద్రుని మీద పడతాయి కాబట్టి సంపూర్ణ చంద్ర గ్రహణం రోజు చంద్రుని బింబం ఎరుపు/ ఆరెంజ్/పసుపు రంగు లో కనిపిస్తుంది. అందుకే రక్తం రంగు లో కనిపిస్తుంది కాబట్టి blood moon అని పేరుపెట్టారు.  రోజూ ఉదయం, సాయంత్రం మనకు సూర్యుడు ఇలాంటి రంగులో కనిపించే విషయం కు సమానం. రెంటికీ కారణం భూమి చుట్టూ ఉన్న వాతావరణం.

Comments

comments

Share this post

scroll to top