ఎవరు ఈ శ్రీరెడ్డి? ఎక్కడి నుంచి వచ్చింది.? ఎందుకిలా సంచలనమైంది.? చాలామందికి తెలియని ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

కాస్టింగ్ కౌచ్ గురించి ఒకడుగు ముందుకేసి వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి..నిర్మాతలు,నటులు పేర్లతో సహా ప్రస్తావిస్తూ పచ్చిగా కాస్టింగ్ కౌచ్ గురించిన నిజాలు బయటపెడుతున్నది..కాస్టింగ్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉన్నదే అయినప్పటికి,ఇంతవరకు ఎందరో హీరోయిన్లు దీని గురించి మాట్లాడినప్పటికి శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలోనే కాదు,ఇండస్ట్రీ బయట హాట్ టాపిక్ గా మారాయి.దాంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెలబ్రిటిగా మారిపోయిన శ్రీరెడ్డి గురించి,ఇంతకీ ఎవరు ఈ శ్రీరెడ్డి?ఏ ఏ సినిమాల్లో నటించింది అంటూ తన గురించి సెర్చింగ్ స్టార్ట్ చేశారు..వాటికి సమాధానాలు..

చదువు ,కుటుంబం

శ్రీరెడ్డి అచ్చ తెలుగు అమ్మాయి. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ఓ సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. ఎప్పుడో ఆరేడేళ్ల కిందట సాక్షి టీవీలో యాంకర్ గా కనిపించిన శ్రీ రెడ్డి అసలు  పేరు విమల. ఇంటిపేరు మల్లిడి. చిన్నప్పటి నుంచి చదువులంటే పెద్దగా ఇంట్రస్ట్ లేని విమల ఎప్పుడూ తాను ఓ పెద్ద హీరోయిన్ అయిపోయినట్లుగా కలలు కంటూ ఉండేది. ఒకరోజు ఇంటిలో కనిపించిన ఎర్రెర్రని రంగును పెదాలకు పూసుకుని మురిసిపోతుండగా తల్లి చూసి వీపు పగిలేలా కొట్టింది. ఎందుకు భోగం వేశాలు వేస్తున్నావంటూ మందలించింది. ఇంటిలో చేతికి గోళ్ల రంగు పెట్టుకున్నా, పెదాలకు లిప్ స్టిక్ రాసుకున్నా ఊరుకునేవాళ్లు కాదు. అంత సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన విమల ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ బాట పట్టింది.

సరిగ్గా పదేళ్ల కిందట 2008లో మంచి ఉద్యోగం చూసుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని విజయవాడ నుంచి భాగ్యనగరానికి చేరింది. అక్కడికి వచ్చాక రంగుల ప్రపంచం ఆకట్టుకోవడంతో యాంకర్ గా చేయడం ఆరంభించింది. సరిగ్గా విమల హైదరాబాద్ కు వచ్చిన ఏడాది తర్వాత సాక్షి టీవీని జగన్ మోహన్ రెడ్డి అప్పుడే కొత్తగా ప్రారంభించారు. అప్పుడు యాంకర్లను తీసుకుంటున్నారని తెలిసి వెళ్లి ట్రై చేసింది. అప్పుడే అనసూయ, గాయత్రీ గుప్తాలతో పాటు విమల కూడా ఎంపికైంది. అలా సాక్షి టీవీ తొలితరం హాట్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడే తన పేరును శ్రీ లేఖగా మార్చుకుంది. అనతి కాలంలోనే హాట్ యాంకర్ గా ఎదిగింది.

తొలిసినిమా… 

‘నువ్వు సూపర్ గా ఉన్నావు.. మంచి హైట్ అందమైన లుక్స్ తో ఆకట్టుకునే నువ్వు సినిమాల్లో ఉండాలి. కాని ఇలా యాంకర్ గా మిగిలిపోవడం ఏమిటని ఆమె స్నేహితులు, సన్నిహితులు ప్రోత్సహించడం వల్ల సినిమాలల్లో ప్రయత్నం చేసింది. పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా గీతామాధురి భర్త నందు హీరోగా నటించిన ‘నేను నాన్న అబద్ధం’ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. ఇక అంతే తన జీవితానికి ఢోకా లేదని శ్రీలేఖ అనుకుంది. పనిలో పనిగా కొందరు సినిమా వాళ్ల సలహా మేరకు తన పేరును శ్రీరెడ్డిగా మార్చుకుంది.అయితే 2011లో విడుదలైన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మరో సినిమాలో ఛాన్స్ కోసం శ్రీరెడ్డి రెండేళ్లు ఆగాల్సి వచ్చింది.

2013లో అరవింద్ 2 చిత్రానికి ఎంపికైంది. ఆ సినిమాల్లో తన శక్తి మేరకు ఏదీ దాచుకోకుండా అంగాంగ ప్రదర్శన చేసింది. ఆ సినిమాలో శ్రీరెడ్డికి మంచి పేరే వచ్చింది. ఇంకేముంది మంచి అవకాశాలే వస్తాయని ఊహించుకుంది. కాని ఊహలన్నీ నిజమవ్వవు కదా.. ఒక్కటంటే ఒక్క అవకాశం రాలేదు.జిందగీ అనే మరొ సినిమాలో హీరో యిన్ గా ఛాన్స్ వచ్చింది. కాని అది రిలీజ్ కు నోచుకోలేదు. ఇక అంతే శ్రీరెడ్డి సినీ ప్రస్థానం ఆ మూడు సినిమాలతోనే ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా మరో అవకాశం రాలేదు. శ్రీరెడ్డికి ఫేస్ బుక్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 60 లక్షల మంది ఫాలోవర్లున్నారు. కనీసం అది చూసి అయినా అవకాశాలిస్తారని ఎదురుచూసింది కాని లాభం లేకపోయింది.

గతంలోనూ సంచలన కామెంట్లు..

శ్రీరెడ్డి ఇప్పుడే కాదు గతంలోనూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. పోర్న్ సైట్లు చూసి ఎంజాయ్ చేసే వారుంటారని, అలాంటిది ప్రభుత్వం పోర్న్ సైట్లను, వేశ్యలను దూరం చేసేస్తే ఎలా అని ప్రశ్నించింది. సెక్స్ టాయ్స్ అందుబాటులోకి రావాలి. అన్ని ఏరియాల్లోనో రెడ్ లైట్ ఏరియాలుండాలి.. అప్పుడు మాత్రమే అమ్మాయిలపై వేధింపులు తగ్గుతాయి.. ఇలా బోల్డ్ గా మాట్లాడుతూ అనేక ఇంటర్వ్యూల్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటూ వెళ్లింది…ఎన్ని చేసినా సినిమా అవకాశాలు రాకపోవడంతో తిరిగి యాంకర్ గా కెరీర్ ప్రారంబించాలనుకకున్నా ఆ అవకాశాలు బెడిసి కొట్టాయి..దాంతో తన ఆవేదననంతా ఇప్పుడు ఇలా వెళ్లగక్కుతున్నది…ఇవి శ్రీరెడ్డి పూర్తి వివరాలు..

Comments

comments

Share this post

scroll to top