ఆ ఒక్క ఫోటో “స్రవంతి” జీవితానికి కొత్త వెలుగుని ఇవ్వబోతుంది..! ఫోటో వెనకున్న రియల్ స్టోరీ ఇదే..!

అమ్మాయి పేరు కొర్ర స్రవంతి తండ్రి కొత్త సేవ్య రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. త‌ల్లి కూలీ పనిచేస్తూ స్ర‌వంతితో పాటు ఒక చెల్లె, అన్న‌ను సాకుతుంది. షాద్‌న‌గ‌ర్ ద‌గ్గ‌ర ఉన్న పెద్ద‌కుంట తండాలో వీరి నివాసం. తండాలోని స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ది స్ర‌వంతి. భ‌విష్య‌త్తులో డాక్ట‌ర్ అవుతానంటుంది. ఇంట్లో ప‌రిస్థితిని అత్యంత ద‌య‌నీయంగా ఉన్న‌ది. వ‌ర్షానికి ఇల్లు కురుస్తుండ‌టంతో అప్పులు చేసి ఇల్లు క‌ట్ట‌డం ప్రారంభించింది స్ర‌వంతి త‌ల్లి తుల‌సి. స్ర‌వంతికి చెవిలో నుంచి చీము కారుతుండ‌టంతో కోరి ఈఎన్‌టి ఆసుపత్రిలో చూపించారు. మందులు వాడుతున్నంత కాలం బాగుంటుంది. మందులు వేసుకోవ‌డం మానేస్తే మ‌ళ్లీ చీము కారుతుంది.

అజ‌హ‌ర్ షేక్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త రాజేంద్ర‌ప్ర‌సాద్ య‌ల‌వ‌ర్తి.. కొంత ఆర్థిక సహాయం చేశారు. ఆ అమ్మాయిని అవ‌స‌రం అయితే ద‌త్త‌త తీసుకుంటా అన్నారు. వ‌చ్చేవారం హైద‌రాబాద్‌కు పిలిపించి కార్పొరేట్ ఆసుప‌త్రిలో వైద్యం చేయిస్తాన‌న్నారు. ఈ విష‌యం తెలిసిన మంగ్లీ షాద్‌న‌గ‌ర్‌లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం తండాకు వెళ్లి అమ్మాయి బాగోగులు తెలుసుకున్న‌ది. తండాలోని అంద‌రినీ ప‌లుక‌రించింది. స్ర‌వంతికి ఆర్థిక స‌హాయం చేసి త‌న మంచిత‌నాన్ని చాటుకున్న‌ది.

రెక్కాడితే గానీ డొక్కాడ‌ని ఈ గిరిజ‌న బిడ్డ కుటుంబాన్ని ఆదుకోవ‌డానికి ఇప్ప‌టికే కొంద‌రు దాత‌లు ముందుకొచ్చారు. ఓ డాక్యుమెంట‌రీ షూట్‌లో భాగంగా జ‌ర్న‌లిస్ట్ అజ‌హ‌ర్ షేక్ గ‌తేడాది పెద్ద‌కుంట తండాకు వెళ్లాడు. అక్క‌డ షూటింగ్ స‌మ‌యంలో ఆ అమ్మాయి చిత్రాన్ని త‌న కెమెరాలో బంధించాడు. ఫిబ్ర‌వ‌రి 2,3,4 తేదీల్లో ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన తెలంగాణ బ‌తుకుచిత్రం ఫొటో ఎగ్జిబిష‌న్‌లో ఆ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టాడు. చిత్రంలో అమ్మాయి మొహంపై చిరున‌వ్వు, అమాయ‌క‌త్వం, న‌మ్మ‌కం సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసేలా చేసింది. ఆ అమ్మాయి ఫొటో ఫ్రేమ్ ముందు చాలామంది ప్ర‌ముఖులు సెల్ఫీలు దిగి సంద‌డి చేశారు.

Comments

comments

Share this post

scroll to top