షూటింగ్‌లో మెరుపులా మెరిసింది: ఎవరీ మను భకర్..? గతమేంటి..? ఆమె గురించి 10 ఆసక్తికర విషయాలివే.!

బుద్దా అరుణా రెడ్డి జిమ్నాస్టిక్స్ లో కాంస్య పతకం సాధించి భారత్ సత్తాని చాటితే,పదహారేళ్ల మను భకర్  షూటింగ్లో స్వర్ణాలు సాధించి సంచలనం సృష్టించింది.

నా ప్రదర్శన నమ్మశక్యంగా లేదు. ప్రపంచకప్‌ను రెండు స్వర్ణాలతో ముగిస్తానని అస్సలు అనుకోలేదు. పతకాల గురించి, రికార్డుల గురించి నేను ఆలోచించలేదు. అవి అలా జరిగిపోయాయంతే. నేను గెలుస్తున్నపుడు రికార్డులు సృష్టిస్తున్నట్లు నాకు తెలియదు. నా టెక్నిక్‌ మీద గంటలు గంటలు పని చేసి, నాకెన్నో విలువైన సలహాలిచ్చిన నా కోచ్‌లకు కృతజ్ఞతలు” – మను బాకర్‌ మెక్సికోలో నిర్వహించిన ప్రపంచకప్ పోటీల్లో రెండు స్వర్ణాలు గెలుచుకున్న తర్వాత మనుభకర్ చెప్పిన మాటలు ఇవి.

మొదట 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచి,టీమ్‌ విభాగంలో మరో  గోల్డ్ మెడల్ సాధించింది.  మెక్సికోలో నిర్వహించిన ప్రపంచకప్ పోటీల్లో రెండు స్వర్ణాలు గెలుచుకున్న తర్వాతనే మను భకర్ ప్రపంచానికి పరిచయమైంది. తను షూటింగ్‌లో బంగారు పతకాలు తీసుకున్నంత మాత్రాన తనకు చిన్నప్పటి నుండి అదొక్కటే తెలుసనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. కానీ ఆమె 2016నుంచే షూటింగ్ ను తన కెరీర్‌లో సీరియస్‌గా తీసుకుంది.తన తండ్రి రామ్ కిషన్ బాకర్ మర్చంట్ నేవీ హైలింగ్‌లో ఇంజినీర్. ఆయన తన దగ్గర ఉన్న రివాల్వర్‌ను శిక్షణ నిమిత్తం ఇవ్వడంతోనే ఆమె నేర్చుకోగలిగింది. ఈ రెండేళ్లలోనే మను ప్రపంచానికి తెలిసేంత సత్తా తెచ్చుకోగలిగిందని అతని తండ్రి బదులిచ్చాడు.

మను గురించి ఆసక్తికరమైన విషయాలు..

  • మను రాష్ట్ర స్థాయి బాక్సర్, తను ఆరేళ్ల వయస్సున్నప్పటి నుంచి శిక్షణ తీసుకోవడం మొదలెట్టింది.
  •  బాక్సింగ్‌తో పాటుగా ఈమె మణిపురీ ప్రాంతానికి చెందిన టాంగ్ టా మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణురాలు.
  •  జాతీయ స్థాయిలో స్కేటింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన ఘనత కూడా మను బాకర్‌కు ఉంది.

  •  స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి మను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు గెలుచుకుంది.
  •  మను తన బోర్డ్ పరీక్షల్లో వంద శాతం మార్కులతో పాసై డాక్టర్ అవ్వాలని కలలకనేది.
  •  ఈ షూటింగ్ విభాగంలో నరేశ్ దగ్గర ప్రాథమిక విద్యను నేర్చుకుని ఇంకాస్త మెరుగైన నైపుణ్యం కోసం జాస్పల్ రానా వద్ద శిక్షణ తీసుకుంది.

Comments

comments

Share this post

scroll to top