“అర్జున్ రెడ్డి” లో ఫ్రెండ్,లవర్, బామ్మగా నటించిన ఈ ముగ్గురు గురించి చాలా మందికి ఆసక్తికర విషయాలివే.!

SHALINI PANDEY: (PREETHI)

తెల్లని దుస్తులు ధరించి పై వస్త్రం గులాభి రంగు పిల్ల గుర్తుందా అదేనండీ ప్రీతి..ప్రీతి శెట్టి..అర్జున్ రెడ్డి లవర్..అర్జున్ రెడ్డిలో ఎన్ని మంచి సీన్స్ ఉన్నా అదొక పర్వర్టెడ్ లవ్ స్టోరీ అనేవాళ్లు చాలామంది ఉన్నారు.ఆ పర్వర్టెడ్ లవ్ స్టోరీ ని ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ గా మార్చిన రెండే రెండు సీన్లు..ప్రీతి కూల్ బేబి అంటూ అర్జున్ కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేసిన ఇంటర్వెల్ ముందు సీన్..మరియు క్లైమాక్స్ లో రెండు రోజులు ఏం చేసావ్ నిద్రపోయావా అంటూ తన ప్రేమ కోసం తాపత్రయపడే సీన్..నిజంగా ఈ రెండు సీన్లలో ప్రీతి నటన అద్భుతం…సినిమా మొదటి నుండి కూడా అమాయకమైన నటన,తన చూపులతో కట్టి పడేసిన ప్రీతి అసలు పేరు షాలిని పాండే..సినిమా హిట్ అవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించింది నటీనటుల సహజ నటన.

షాలిని పాండే సొంత ఊరు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్.ఇంజనీరింగ్ చదువుతూ ధియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుని అనేక నాటకాల్లో నటించింది.నాటకాల వరకు ఒకే కానీ సినిమాలు నో అని ఇంట్లో వాళ్లు చెప్పడంతో వారిని ఒప్పించి అర్జున్ రెడ్డి సినిమాలో నటించింది.అవునండీ ప్రీతి మంచి ఇంజీనిరు కావాలని వాళ్ల నాన్న కోరిక.కానీ కూతురు ఇష్టానికే మొగ్గు చూపి ఆయన కూడా పర్మిషన్ ఇచ్చారు. గత ఏడాది సెట్ ఇండియా చానల్ లో వచ్చిన ‘ మన్ మే విశ్వాస్ హై’ టీవీ షో ఎపిసోడ్లలో నటించింది.  అలా తన ఫొటోలను చూసిన “అర్జున్ రెడ్డి” డైరెక్టర్  సందీప్ రెడ్డి వంగా తన సినిమాలో అవకాశం ఇచ్చారు.లిప్ లాక్ అంటే అదొక ఎమోషన్.. లవర్స్ మధ్య ఆ ఎమోషన్ పండాలంటే అవన్నీ తప్పనిసరి. పాత్రకు న్యాయం చెయ్యడంకోసం అలా నటించాను.ఓ థియేటర్ ఆర్టిస్ట్ గా  సీన్ పండాలంటే ఎలా నటించాలో నాకు తెలుసు. అందుకే ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నటించాను అంటున్న షాలిని ఫస్ట్  ఆడిషన్ వీడియో పై మీరు ఒక లుక్కేయండి..

watch video here:

RAHUL RAMAKRISHNA (SHIVA):

ఒకప్పుడు సినిమా ఛాన్సుల కోసం ఏళ్లకేళ్లు ఎదురు చూడ్డం,చెప్పులరిగేలా తిరగడం లేదంటే పెద్ద డైరెక్టర్ దగ్గర కొన్నేళ్లపాటు పనిచేయడం..కానీ ఇప్పుడు చాలామంది చేతులల్లో కెమెరాలు తమ మైండ్లో మెరిసిన ఆలోచనని షార్ట్ ఫిలింగా తీసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం..అది హిట్టా ఫట్టా అనేది దానికొచ్చే వ్యూస్ చెప్పేస్తాయి… పెళ్లిచూపులు తీసి తన పేరు సిల్వర్ స్క్రీన్ పై చూసుకోకముందు తరుణ్ భాస్కర్ తీసిన సినిమా… సైన్మా అనే షార్ట్ ఫిలిం..అందులో హీరో ఎవరనుకున్నారు రాహుల్ రామకృష్ణ..అదేనండీ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ శివా క్యారెక్టర్ చేసినతను…వీరిద్దరి కాంభినేషన్లో వచ్చిన సైన్మ కూడా పూర్తిగా తెలంగాణా స్లాంగ్ లోనే…

కథ విషయానికొస్తే మరదలి ని పెళ్లి చేసుకోవాలనుకునే బావ రామచందర్..తన మరదలు రాములని ప్రేమించి లేచిపోదామనుకునే సరికి తల్లిదండ్రులు చూసి ..ఊరి పెద్దల ముంగట పంచాయితి పెడతారు..దానికి రాముల అన్న నీకొక థియేటర్ ఉంది కదా అందులో రిలీజ్ అయ్యే సిన్మా హౌజ్ ఫుల్ అయి మస్త్ పైసల్ సంపాయిస్తే నా చెల్లినిస్తా అంటాడు..అతని థియేటర్లోకి వచ్చిన సినిమా ఎలా హిట్టయింది,మరదలిని పెళ్లి చేసుకున్నాడా..అసలు ఏంజరిగింది అనేదే ఈ స్టోరీ..షార్ట్ ఫిలిం చూసినట్టుగా కాకుండా సినిమా చూసిన ఫీల్ మిగులుస్తుంది ఈ సైన్మ…మీరూ ఒక లుక్కేయండి…

Watch video here:

KANCHANA:

కాంచన ఒకప్పటి తెలుగు నటి..మనుషులు మారాలి,మంచి కుటుంబం,అవే కళ్లు లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.తన నటనతో ,అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ కాలంలోనే స్విమ్ సూట్ ధరించి గ్లామరస్ నటిగా క్రేజ్ సంపాదించుకుంది.అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ బామ్మగా కాంచన నటించారు… అప్పటికి ఇప్పటికి ఏ మాత్రం తీసిపోనీ నటనతో ఆకట్టుకున్నారు..నటనతో ఆకట్టుకున్న ఆమె జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని మీకు తెలుసా..కాంచన గురించి కొన్ని విషయాలు..

ఉన్నత కుటుంబములో జన్మించిన ఈమె చిన్న తనములోనే భరత నాట్యం మరియు సంగీతంలో శిక్షణ పొందింది.. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించింది..అప్పుడే దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించిచూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూధనరావు గారి వీరాభిమన్యులో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది. తర్వాతకె.విశ్వనాధ్ దర్శకత్వంలో ఆత్మ గౌరవంలో పోషించిన నాయిక పాత్రలో గ్లామర్ తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. కాంచన సాంఘిక చిత్రాలే కాదు దేవకన్య, అందం కోసం పందెం,శ్రీకృష్ణావతారం వంటి జానపద, పౌరాణిక చిత్రాలలో మంచి నటనను ప్రదర్శించారు.కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణమండపంలో పొషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడలో వచ్చిన ‘గజ్జె పూజ’. ఒక వేశ్య కూతురుగా సంఘంలో గౌరవం పొందటం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయం, తృప్తి, అవ్యక్త మధురానుభూతితో మథనపడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకుల కళ్ళు చమర్చాయి. హీరోయిన్ గా రిటైరైన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు.

కన్నతల్లిదండ్రులనుండే కష్టాలను ఎదుర్కొన్నారు కాంచన.తనకు తెలియకుండా తెల్లకాగితం పై సంతకం చేయించుకుని ఆస్తి మొత్తం సొంతం చేసుకోవడమే కాకుండా..తమ కూతురు చెడిపోయిందంటూ కాంచనపై లేనిపోనీ ప్రచారాలు చేసి పెళ్లి కాకుండా చేశారు.కాంచన తన జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉన్నారు.ఎటు దిక్కుతోచని స్థితిలో ఒక గుడిలో ఉంటూ కాలం వెళ్లదీశారు.కోర్టులో తల్లిదండ్రులకు వ్యతిరేఖంగా కేసు వేసి సుధీర్ఘపోరాటం తర్వాత 15కోట్ల ఆస్తిని కాంచన దక్కించుకోగలిగారు.ఆ ఆస్తి మొత్తం కూడా టిటిడికి ఇచ్చేసారు.తర్వాత సాధారణ జీవితం గడుపుతూ..అదిగో ఇప్పుడు ఇలా అర్జున్ రెడ్డిలో మెరిసే ఆవిడ అభిమానులనే కాదు తెలుగు సినిమా అభిమానులను కూడా ఆశ్చర్యానికి,ఆనందానికి గురిచేశారు.ఎన్నో ప్రయత్నాల అనంతరం ఆవిడ ఈ సినిమా ఛాన్స్ ఒప్పుకున్నారట..

Comments

comments

Share this post

scroll to top