ఈ “ఛలో” నటుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా.? ఒకప్పుడు ఎలా ఉండేవాడంటే.?

నల్లని శరీర ఛాయ,రివట లా ఆకారం,గుండుతో చూడగానే నవ్వుతెప్పించే నటుడు రాజేంద్రన్..  కాకపోతే అతడి ఆకారం వెనుక ఒక విషాద గాధ ఉందని మనకి తెలీదు..అసలు రాజేంద్రన్ నటుడు కాకముందు స్టంట్ మ్యాన్ గా చేసాడని అతి కొద్దిమందికే తెలుసు..స్టంట్ మ్యాన్ గా ఉన్నప్పుడు జరిగిన ప్రమాదమే అతడి రూపురేకల్ని మార్చేసింది..అసలేం జరిగింది?

కేవలం తమిళ సినిమాల ద్వారానే కాదు తెలుగులో వచ్చిన ఆప్తుడు,శ్రీ,గుడుంబా శంకర్ సినిమాల ద్వారా నటుడిగా రాజేంద్రన్ మనకు సుపరిచితుడే..ఇటివల వచ్చిన ఛలో సినిమాలో కూడా సీనియర్ ముత్తుగా నటించి అలరించారు..సినీ పరిశ్రమలో స్టంట్ మ్యాన్  అంటే ఎంతో రిస్క్ తీసుకుని పోరాట సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.ఎంతో ఎత్తు నుంచి దూకడం, మంటల్లోకి జంప్ చేయడం, ప్రమాదకరమైన రీతిలో బైక్ రైడింగ్ వంటి విన్యాసాలు చేయాలి. కానీ స్టంట్ మ్యాన్ లు చేసే ప్రతి షాట్ వెనుక మృత్యువు దోబూచులాడుతూనే ఉంటుంది.  రాజేంద్రన్ కెరీర్ మొదట్లో ఓ స్టంట్ మ్యాన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దాదాపు 500 సినిమాలకు స్టంట్స్ చేశాడు. అయితే ఓ మలయాళ మూవీ కోసం బైక్ పై స్టంట్ చేస్తుండగా సీన్ డిమాండ్ చేసిన మేరకు అతడిపై నీళ్లు పోశారు. కానీ ఆ నీటిలో ఏవో ప్రమాదకరమైన కెమికల్స్ కలవడంతో రాజేంద్రన్ కు తీవ్రస్థాయిలో స్కిన్ ఎలర్జీ వచ్చింది. దాని ఫలితమే శరీరంపై ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయాయి.

ఇప్పటి సినిమాల్లో రాజేంద్రన్ ను చూస్తే ఇట్టే గుర్తుపట్టేయొచ్చు.కనీసం కనుబొమ్మలపై కూడా వెంట్రుకలు లేకుండా నునుపుగా కనిపిస్తుంటాడు. అయితే, స్టంట్ మ్యాన్ గా కొంతమందికే తెలిసిన రాజేంద్రన్ మారిన తన శరీరం కారణంగా నటుడిగా ఎన్నో చాన్సులు దక్కించుకోగలిగాడు.

Comments

comments

Share this post

scroll to top