హైదరాబాద్ లోని ఆ హాస్పిటల్ లో 6-10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..! వివరాలు ఇవే..!

విద్య ,వైధ్యం నేడు వ్యాపారమయం అయిపోయాయి. తనకొచ్చిన జబ్బుకంటే ఆసుపత్రి బిల్లు ఎంత వస్తుందో అన్న భయమే ఇప్పుడు సామాన్యుడి భాద. ఆరోగ్యం మరీ ఖరీదైన సెవగా మారిపోయిన కాలం లో  క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బు గనక వచ్చిందంటే ఇక మరణాన్ని ఆహ్వానించటం తప్ప ఇంకేం చేయలేని పరిస్తితుల్లో ఉన్న మధ్య తరగతి జీవులకి ఉచిత వైధ్యం అంటే సాక్షాత్తూ వరం అన్నమాటే కదా..! ఎక్కడా? అంటే సమాధానం… ఇక్కడ దొరుకుతుంది…

ఎంతో కష్టమైన, ఖర్చుతో కూడుకున్న క్యాన్సర్ ఆపరేషన్లను కూడా  సమర్థమంతంగా నిర్వహిస్తూ ఎందరో క్యాన్సర్‌ రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తోంది  MNJ  క్యాన్సర్‌ హాస్పటల్.  ఇదీ ఎక్కడో కాదు హైదరాబాద్ లోనే . దేశం లోని పెద్దపెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రులు కూడా ఇప్పటి వరకూ చేయనీ, చేయలేని క్యాన్సర్‌ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలనూ ఇక్కడ ఉండే డాక్టర్లూ,  వైద్యనిపుణులు సాధ్యం చేసి చూపిస్తున్నారు.

పునర్నిర్మాణ శస్త్ర చికిత్స అంటే క్యాన్సర్ సోకినప్పుడు కొన్ని శరీర భాగాలని తొలగించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు దెబ్బతిన్న బ్రెస్ట్ ని తీసెస్తారు కదా. అలాగే క్యాన్సర్ చికిత్సతో పాటుగా క్యాన్సర్ వల్ల తల నుంచి పాదం వరకూ శరీరంలోని ఏ అవయవానికి క్యాన్సర్‌ సోకి భాగాన్ని తొలగించాల్సి వచ్చినా అన్నింటినీ తిరిగి అమర్చడంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అవయవ భాగాలను తొలగించడంతో ఏర్పడిన అవకరాన్ని తమ అతి సూక్ష్మ శస్త్రచికిత్స నైపుణ్యంతో చక్కదిద్దుతున్నారు.

అవయవాలు కోల్పోయిన క్యాన్సర్‌ రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడమే కాదు వాటిని పునఃసృష్టి చేసి పూర్వరూపాన్ని అందిస్తున్నారు. క్యాన్సర్‌ కారణంగా తొలగించిన అవయవాలను పునర్నిర్మించే చికిత్సలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రూ.6-10 లక్షల వరకూ ఖర్చవుతుండగా ఎంఎన్‌జేలో ఉచితంగానే చేస్తున్నారు.గత పదేళ్లలో నాలుగువేలకు పైగా పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చేయగా అందులో 90 శాతం మంది నిరుపేదలే కావడం ఆసుపత్రి అందిస్తోన్న విశిష్ట సేవలకు నిదర్శనం.

Comments

comments

Share this post

scroll to top