రహస్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో 25 మంది హీరోలతో చిరు భేటీ.! ఏమైందో తెలుసా.?

టాలీవుడ్ టాప్‌ హీరోల అత్యసర భేటీ హాట్‌టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో అగ్ర హీరోలంతా అన్నపూర్ణ పూర్ణ స్టూడియోలో సమావేశమైనట్లు తెలుస్తోంది. హీరోలు మహేష్‌బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, నానిలతో పాటూ మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. హీరోలతో పాటూ అల్లు అరవింద్, నాగబాబు, పీవీఎస్సెస్ ప్రసాద్‌, జీవితా రాజశేఖర్, మంచు లక్ష్మితో పాటూ మరికొందరు సినీ ప్రముఖులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ మా అసోషషన్ కు వెళ్లి ఇండస్ట్రీ పెద్దలతో, మా సభ్యులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ గురించి ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో అంతర్మధనం మొదలైంది.పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం టీవీ9, ఏబీఎన్, టివి5 ఛానల్స్ ని బాయ్ కాట్ చేయాలని అభిమానులకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సదరు ఛానల్స్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన హీరోల సమావేశంలో కూడా సంచలన ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సదరు టివి ఛానల్స్ కు చిత్ర పరిశ్రమకు చెందిన ఆడియో వేడుకలు, యాడ్స్ ఇవ్వకూడదని ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. మరో మరు సమావేశం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top