మహేష్ బాబు చెయ్యాల్సిన సినిమా ని నేను చేశా, నా అంత తోపు లేడనుకుంటే అంతే – అలీ

తెలుగు ఇండస్ట్రీ స్టార్ కమెడియన్ అలీ గారు ఇటీవలే సినీ ఇండస్ట్రీ లో 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అలీ ని సత్కరించారు కూడా సినీ రంగం లో 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు. కమెడియన్ లను ఒకలాగా, హీరో లను ఒకలాగా చూడరు ఇండస్ట్రీ లో అని అలీ తెలిపారు. ఒక ఇంటర్వ్యూ లో అలీ గారు కొన్ని ఆసక్తి కార విషయాలను పంచుకున్నారు.

మహేష్ బాబు చెయ్యకపోడం వలనే నాకు…:

అలీ మాట్లాడుతూ : ‘దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల కథని మహేష్ బాబు కోసం సిద్ధం చేసారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారికి విమానంలో ఎస్వీ కృష్ణారెడ్డి ఈ కథ వినిపించారు. కథ బావుందని కృష్ణ గారు ప్రశంసించారు, కానీ మహేష్ బాబు ఇప్పుడు సినిమా చేయడం కుదరదని కృష్ణ గారు తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు చదువుకుంటున్నాడు, చదువు పూర్తి కావడానికి మరో ఐదేళ్లు పడుతుందని కృష్ణ గారు ఎస్వీ కృష్ణారెడ్డి తో చెప్పారు, దీంతో ఆయన ఇంకొక హీరో ని వెతికే క్రమం లో నాతో తియ్యాలని ఎస్వీ కృష్ణారెడ్డి గారు భావించారు’ అని అలీ తెలిపారు.

అవహేళన చేసినా.. :

‘అలీ ని హీరో గా పెట్టి సినిమా తియ్యడం ఏంటి అని ఎస్వీ కృష్ణారెడ్డి గారిని చాలా మంది అవహేళన చేసారు, ఆయన దర్శకుడిగా అప్పటికే మూడు హిట్ చిత్రాలు తెరకెక్కించారు. ఈ సమయంలో ఓ కమెడియన్ తో చేస్తున్నావు, నీ కెరీర్ దెబ్బ తినదా అని చాలామంది ఆయనకు చెప్పారు. మాకు కథపై నమ్మకం ఉంది అని ఎస్వీ కృష్ణారెడ్డి వారికి బదులిచ్చారు, కట్ చేస్తే యమలీల చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, యమలీల చిత్రం ద్వారా ఎస్వీ కృష్ణారెడ్డి గారికి మరింత పేరువచ్చింది, నా కెరీర్ లో ఆ సినిమా తరువాత చాలా సినిమాల్లో హీరో గా నటించా, కానీ యమలీల చిత్రం మాత్రం నాకు ఎప్పటికి స్పెషల్’. అని అలీ తెలిపారు.

నా అంత తోపు లేడనుకుంటే… :

‘హీరో గా కంటిన్యూ చెయ్యలేక కాదు మళ్ళీ కమెడియన్ అయ్యింది, మంచి పాత్రలు చెయ్యాలని నాకు ఇష్టం, ఒక్క సినిమా హిట్ కాగానే నా అంత తోపు లేడనుకుంటే అంతే పరిస్థితి, హీరో గా ఛాన్స్ వస్తే కథ నచ్చితే చేస్తా, అలాగే కమెడియన్ గా కూడా కంటిన్యూ అవుదాం అని నిర్ణయించుకున్నా’. అని అలీ వివరించారు.

Comments

comments

Share this post

scroll to top