హాయ్ మెసేజ్‌తో.. గృహిణి జీవితం కల్లోలం..! అలాంటి మెసేజీలు వచ్చినప్పుడు జాగ్రత్తపడండి.! లేదంటే.?

భార్యాభర్తల మద్య చిచ్చు పెడుతున్న వాటిలో ప్రధమ స్థానం మొబైల్ ఫోనే దే.నేడు ప్రతి ఒక్కరూ మొబైల్లో మునిగిపోయి తమ పక్కనున్నవారిని పట్టించుకోకపొవడం పరిపాటి అయింది.సోషల్ మీడియా స్నేహాలు కాపురాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి.ఇంటర్నెట్ ప్రపంచాన్ని మంచికి వినియోగించుకునే వారికన్నా చెడు వినియోగమే ఎక్కువవుతుంది.ఇదే క్రమంలో ఒక చిన్న మెసేజ్..ఒక  గృహిణి జీవితాన్ని నాశనం చేసింది..ఎలాగో మీరే చదవండి.

హైదరాబాద్‌లోని ఓల్డ్ మలక్‌పేటకి చెందిన పవన్ కుమార్ డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతను తనకు తోచిన నంబర్లకి వాట్సాప్‌ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టడం చేసాడు…అలా చాలామందికి చేయగా ఒక నంబర్ నుండి  ‘ఎవరు..?’ అని రిప్లై మెసేజ్ వచ్చింది..అలా  ప్రశ్నించడంతో.. సారీ.. రాంగ్ నంబరు అంటూ సమాధానమిచ్చాడు.అంతటితో ఆగకుండా  ఆ తర్వాత మీరెవరు..? అని ప్రశ్నించి..మెల్లిగా మాటల్లోకి దింపి అవతలివైపు ఉన్నది గృహిణి అని తెలియడంతో తియ్యగా మాటలు కలిపాడు.ఆ రోజు మొదలు.. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అంటూ మొదలెట్టి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ.. ఆమెకి దగ్గరయ్యాడు. ఆమె కూడా రిప్లై ఇస్తూ ఉండటంతో.. వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఈ క్రమంలోనే గృహిణి‌పై ప్రేమ నటించిన పవన్ కుమార్ ఇటీవల ఆమె భర్త ఇంట్లోలేడని తెలుసుకుని వాళ్లింటికి వెళ్లాడు. అక్కడ ఆమెని బెదిరించి అత్యాచారం చేశాడు..

తియ్యని మాటలతో ఆమెని లొంగదీసుకున్న నిందితుడు అత్యాచారం చేయడంతో పాటు పలుమార్లు బెదిరించి దాదాపు రూ.55 వేలు, 5 గ్రాముల బంగారును దోచుకెళ్లాడు. అయినప్పటికీ.. అతని వేధింపులు ఆగకపోవడంతో.. ఎట్టకేలకి బాధితురాలు ధైర్యం చేసి భర్తకి అసలు విషయం చెప్పడంతో.. వారిద్దరూ మీర్‌పేట పోలీసులకి ఫిర్యాదు చేశారు.దీంతో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

comments

Share this post

scroll to top