ఆ ఒక్క తెలుగు అక్షరంతో ఫోన్లన్నీ పనికిరాకుండా అవుతున్నాయంట..! జాగ్రత్త పడండి…లేదంటే..?

రెండు రోజులుగా సోషల్ మీడియా అంతట వినిపిస్తున్న ఒకేమాట స్పామ్..స్పామ్ తో ఎఫ్బీలో పోస్టులు డిలీట్ అవ్వడం,మొబైల్లో మెసేజెస్ డిలీట్ అవుతున్నాయి అనే మాట ఎక్కువగా వింటున్న మాట.అంతే కాదు మొబైల్స్ లో సాఫ్ట్వేర్ క్రాష్ అవుతుందట..స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ఐఫోన్స్ కూడా దీని ధాటికి పడడం విశేషం,..అయితే ఇదంతా జరగడానికి కేవలం ఒకే ఒక తెలుగు అక్షరం కారణమట. ‘జ్ఞా’’ అనే ఒక్క అక్షరం ఐమెసేజ్‌ యాప్‌ సహా పలు మెసేజింగ్ యాప్‌లను ఉన్నపళాన చతికిలపడేట్టు చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లతో పాటు  మ్యాక్ ఓఎస్, టీవీఓఎస్ 11, వాచ్ఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు,మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌లు కూడా ఈ అక్షరం కారణంగా క్రాష్ అవుతున్నాయి.. అయితే టెలీగ్రామ్, స్కైప్ వంటి యాప్‌లు దీని బారిన పడలేదని గుర్తించారు..యాపిల్‌ఫోన్ పాత వెర్షన్ల జోలికి వెళ్లని ఈ బగ్… ఐఓఎస్ 11.2.5పై పనిచేసే ఫోన్లనే క్రాష్ చేస్తోంది. ఐమెసేజ్ యాప్‌తో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, జీమెయిల్, ట్విటర్‌లను కూడా ప్రభావితం చేస్తోంది. ఒక్కసారి ఈ బగ్ బారిన పడ్డారంటే ఇక మళ్లీ మళ్లీ రీస్టార్ట్ చేసినా సదరు యాప్‌లు పనిచేయడం లేదని చెబుతున్నారు.

ప్రత్యేకించి ఐఫోన్‌లో ఏదైనా నోటిఫికేషన్ ద్వారా ‘‘జ్ఞా’’ అనే అక్షరం వచ్చిందంటే.. అది ఐఫోన్ స్ప్రింగ్ బోర్డు మొత్తాన్ని (హోం పేజిని మేనేజ్ చేసే సాఫ్ట్‌వేర్) నిలిచిపోయేలా చేస్తుంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే వినియోగదారులు రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల బూట్‌లూప్‌కి  కారణమై మళ్లీ డివైజ్‌లు తిరిగి ఆన్ అయ్యే అవకాశం ఉండదట. దీని ద్వారా హ్యాకర్లు సొమ్ములు డిమాండ్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు. ‘మొబైల్ వరల్డ్’ అనే ఓ వెబ్‌సైట్ వాళ్లు ఈ బగ్‌ను తొలుత గుర్తించారు. కాగా 2015 మరాఠీ, అరబిక్, చైనా భాషల్లోని అక్షరాలు, సంకేతాలు ఇదే మాదిరిగా ఐఫోన్ మెసేజ్ యాప్‌‌ను క్రాష్ చేశాయి.ఇప్పుడొచ్చిన  సాంకేతిక లోపాన్ని గుర్తించామనీ… దీనికి పరిష్కారం కనిపెట్టేందుకు కృషి చేస్తున్నామని యాపిల్ కంపెనీ వెల్లడించింది.

Comments

comments

Share this post

scroll to top