భార్య అక్రమసంబంధం గురించి భర్త బెదిరించాడని…ఆమె ప్రియుడు వారి కొడుకుని హత్య చేసాడు.! మిస్టరీ వీడింది!

ఇటీవల కాలంలో అక్రమసంభందాల కారణంగా భర్తలను మట్టుపెట్టిన ఎన్నో ఘటనలు చూసాం. ఇప్పుడు అక్రమసంభందం పదేండ్ల పసివాడి ప్రాణాలను బలితీసుకొంది..వివాహితతో సంభందం పెట్టుకోవడంతో,అది తెలిసిన భర్త నిలదీసాడనే కారణంగా పిల్లాడి ప్రాణాలను బలిగొన్నారు.సంచలనం సృష్టించిన ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.
ఎంజీఆర్‌ నగర్‌ సమీపంలో నేసపాకం భారతి నగర్‌కు చెందిన కార్తికేయన్‌ కుమారుడు పదేళ్ల రితేశ్ సాయి  అమృత విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతున్నాడు.  సాయంత్రం టైంలో హిందీ ట్యూషన్‌కి వెళ్లిన రితేష్‌సాయి రాత్రి 8.30 అయినా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కార్తికేయన్‌ ఎంజీఆర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన భార్య మంజులకు సేలయూర్‌‌ ప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నాగరాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు కార్తికేయన్ తెలిపాడు. తన కుమారుడిని అతడే కిడ్నాప్‌ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు.
దాంతో పోలీసులు నాగరాజు మొబైల్‌ను ట్రేస్‌చేయడంతో వేలూరులో ఉన్నట్లుగా గుర్తించారు, అరెస్టు చేసి విచారించగా… తంబారం-సేలయూర్ రోడ్డు సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవంతిలో తీవ్రగాయాలతో రితేశ్ సాయి విగతజీవిగా పడి ఉన్నాడు. సాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం క్రోమ్‌పేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీఎన్‌ఈబీలో ఉద్యోగినిగా విధులు నిర్వహించే మంజులకు నాగరాజుతో పరిచయం ఏర్పడి క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి సంబంధం గురించి భర్త కార్తికేయన్‌కు నాలుగు నెలల కిందట తెలియడంతో మందలించాడు. అయినా సరే వీళ్లు వినిపించుకోలేదు. దీనిపై జనవరిలో పోలీసులకు కార్తికేయన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు నాగరాజును పిలిపించి హెచ్చరించారు. దీంతో అక్కసు పెంచుకున్న నిందితుడు రితేశ్ సాయిని అపహరించి హత్య చేశాడు.

Comments

comments

Share this post

scroll to top