అక్కినేని – దగ్గుబాటి కుటుంబాలు కలిసి…కొత్త కోడలు “సమంత” కు ఇవ్వబోయే సర్ప్రైస్ గిఫ్ట్ ఏంటో తెలుసా.?

సమంత – నాగ చైతన్య పెళ్లి వార్త ఎన్ని రోజుల నుండి వైరల్ అవుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఫాన్స్ అందరు అక్టోబర్ 6 డేట్ ను లాక్ చేసుకున్నారు. గోవా లో పెళ్లి జరగబోతోంది. ఫైనల్ గా అక్టోబర్ 6 రానే వచ్చింది. పెళ్లి కాస్ట్యూమ్ లో ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో దర్శనం ఇచ్చింది.

అయితే, వీరిద్దరి పెళ్లి వేడుకక కోసం హీరో నాగార్జున పది కోట్ల రూపాయలను కేటాయించినట్టు సమాచారం. పైగా, పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని చైతూ – సామ్‌లే ఇవ్వనున్నారట. గోవాలో అక్టోబర్ 6న, 7న రెండు సాంప్రదాయక పద్దతుల్లో గ్రాండ్‌గా జరుగనున్న వెడ్డింగ్ ఈవెంట్‌కు కేవలం 100 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారట.

ఇది ఇలా ఉండగా..సమంత – చైతన్య పెళ్లి ముహూర్తం అక్టోబర్ 6 , రాత్రి 11 : 52 నిమిషాలకు. మూడు గంటల నుండి ఆరు గంటల వరకు మెహందీ ఫంక్షన్. రాత్రి 8 : 30 నుండి డిన్నర్. అక్టోబర్ 7 న సాయంత్రం 6 గంటలకు క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి.

w – hotel లో పెళ్లి..


ఇంకొద్ది సేపట్లో గోవాలో నిరాడంబరంగా నాగ చైతన్య, సమంతల వివాహం జరుగనుండగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కలసి సమంతకు వెల్ కమ్ చెబుతూ ఓ చిన్న వీడియోలో యాక్ట్ చేశారు. వివాహం జరుగుతున్నప్పుడు ప్రదర్శించేందుకు ఈ వీడియోను రూపొందించారు. ఎగ్జాట్ గా పెళ్లి జరిగే సమయాన వారికి సర్ప్రైస్ ఇవ్వడానికి చాలా రహస్యంగా ఉంచారు ఈ విషయాన్ని.. సమంతకు సర్ ప్రైజ్ గా ఈ వీడియోను కానుకగా ఇవ్వాలని భావించిన రెండు ఫ్యామిలీలూ ఆమెకు స్వాగతం చెబుతూ కనిపిస్తాయి. నాగార్జున, అమల, అఖిల్ తో పాటు వెంకటేష్, రానా, సుమంత్ తదితరులంతా ఈ వీడియోలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ వీడియో సమంతకు స్వీట్ షాకింగ్ గా ఉంటుందన్న నమ్మకంతో వీరంతా ఉన్నారట.

 

Comments

comments

Share this post

scroll to top