అక్కినేని హీరోస్ రేర్ పిక్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..?

నటనలో ఉన్నతుడు , మనిషిగా మహోన్నతుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన మరణించి అప్పుడే నాలుగేళ్ళు పూర్తైంది. చిత్రసీమలో ఎన్నో మజిలీలు చేసిన అక్కినేని పలు మలుపులు చూశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని, ఆటంకాల్ని ఎదుర్కొని, అవరోధాల్ని అధిగమించి హీరో అయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి నటశిఖరం చేరుకున్నారు. ఆయన మరణం తీరని లోటు. అక్కినేని ఫ్యామిలీతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా బరువెక్కిన గుండెలతో ఆయన జ్ఞాపకాలు తలుచుకుంటూనే ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు న‌టించిన చివ‌రి చిత్రం మ‌నం కాగా, ఇది విడుద‌లై నేటితో నాలుగేళ్ళు పూర్తైంది. ఆరోగ్యం స‌హ‌కరించ‌కున్నా, చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు న‌టిస్తూనే ఉండాల‌ని ఈ చిత్రాన్ని పూర్తి చేశారు ఏఎన్ ఆర్‌. అయితే మ‌నం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నాగార్జున త‌న ట్విట్ట‌ర్‌లో ఏఎన్ఆర్ ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. మీరు న‌వ్వ‌డం నేర్పించారు, ఏడ్వ‌డం నేర్పించారు. జీవితం, మ‌ర‌ణం ఎలా ఫేస్ చేయోలా నేర్పించారు. మాలో ఇంత‌టి స్పూర్తి క‌లిగించిన మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటామ‌ని నాగ్ అన్నారు. ఇక అన్న‌పూర్ణ స్టూడియోస్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా చైతూ, నాగ్‌, ఏఎన్ఆర్ క‌లిసి ఉన్న రేర్ పిక్‌ని ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. ఈ పిక్ అక్కినేని అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఏదేమైన‌ మూడోతరం వారసులు నాగ చైతన్య, అఖిల్ తో మనం మూవీ ద్వారా స్క్రీన్ షేర్ చేసుకున్న అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకి త‌న‌ 75 ఏళ్ళ నట జీవితంలో ఇదో మధుర అనుభూతి అని చెప్పవచ్చు.

Tweet :

Comments

comments

Share this post

scroll to top