జ‌న‌నావ‌య‌వాల వ‌ద్ద ఉండే వెంట్రుక‌ల‌ను తీయ‌కూడ‌దా..? తీస్తే ఏమ‌వుతుంది తెలుసా..?

ప్యూబిక్ హెయిర్. జ‌న‌నావ‌య‌వాల వ‌ద్ద ఉండే వెంట్రుక‌లు. స్త్రీలు, పురుషుల‌కు ఇవి పెరుగుతాయి. చాలా మంది ఎప్ప‌టిక‌ప్పుడు ఈ వెంట్రుక‌ల‌ను క్లీన్‌గా షేవ్ చేసుకుంటారు. కొంద‌రు వాక్సింగ్, హెయిర్ రిమూవ‌ర్ వంటి ప‌ద్ధ‌తుల‌తో వీటిని తొల‌గించుకుంటారు. అయితే నిజానికి మీకు తెలుసా..? ప‌బ్లిక్ హెయిర్‌ను అస‌లు తీయ‌కూడ‌దట‌. అవును, మీరు విన్న‌ది నిజమే. ఇది మేం చెబుతోంది కాదు, ప‌లు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అస‌లు స్త్రీలు, పురుషులు ఎవ‌రైనా నీట్‌గా ఉండ‌డం కోసం ప్యూబిక్ హెయిర్ను తీసేస్తారు. కానీ అలా చేయ‌కూడ‌ద‌ట‌. సైంటిస్టులు కూడా ఇదే విష‌యాన్ని ధృవీక‌రిస్తున్నారు. మ‌రి వారు అలా చెప్పేందుకు గ‌ల కార‌ణాలు ఏంటో తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్యూబిక్ హెయిర్ను తీసేస్తే ఆ భాగాల్లో ఇన్‌ఫెక్ష‌న్లు, చ‌ర్మంపై ద‌ద్దుర్లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఆ ప్రాంతంలో ఉండే చ‌ర్మం పాడ‌వుతుంద‌ట‌. అందుక‌ని ప‌బ్లిక్ హెయిర్‌ను తీయ‌కూడ‌ద‌ట‌.

2. అనేక ర‌కాల బాక్టీరియాలు, వైర‌స్‌ల నుంచి ప్యూబిక్ హెయిర్మ‌న‌కు ర‌క్ష‌ణ‌నిస్తుంద‌ట‌. క‌నుక ఎవ‌రూ కూడా దాన్ని తీయ‌కూడ‌ద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఒక వేళ అంత‌గా కావాల‌నుకుంటే కొంత వ‌ర‌కు హెయిర్‌ను ఉండ‌నిస్తేనే మంచిద‌ని వారు చెబుతున్నారు.

3. ప్యూబిక్ హెయిర్ను తీశాక అది మ‌ళ్లీ పెరుగుతుంది క‌దా. అలా పెరిగే క్ర‌మంలో ఆ భాగంలో చాలా దుర‌ద పెడుతుంద‌ట‌. దీంతోపాటు ఆ భాగంలో సెన్సిటివ్‌గా ఉండే చ‌ర్మం అల‌ర్జీల బారిన ప‌డుతుంద‌ట‌.

4. త‌ర‌చూప్యూబిక్ హెయిర్ను తీస్తూ ఉంటే కొంత కాలానికి ఆ భాగంలో ఉండే కొన్ని వెంట్రుక‌లు స‌రిగ్గా పెర‌గ‌వ‌ట‌. దీంతో అక్క‌డ బ్లాక్ హెడ్స్, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ట‌. ఇలా వ‌స్తే ఇంకా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ట‌.

5. జ‌ననావ‌య‌వాల ద‌గ్గ‌ర ఉష్ణోగ్ర‌త‌ను ఎప్పుడూ అక్క‌డి వెంట్రుక‌లు క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. ఈ క్ర‌మంలో వెంట్రుక‌లు లేక‌పోతే ఆ భాగంపై బ‌యటి ఉష్ణోగ్ర‌త‌ల ప్ర‌భావం ఎక్కువ‌గా ప‌డుతుంద‌ట‌. అది జ‌న‌నావ‌య‌వాల‌కు అంత మంచిది కాద‌ట‌. క‌నుక ప్యూబిక్ హెయిర్ ఉంచుకోవాల‌ట‌.

6. ప్యూబిక్ హెయిర్ ఉండ‌డం వ‌ల్ల లైంగిక వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. ప‌లు అధ్య‌య‌నాలు ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. క‌నుక ప్యూబిక్ హెయిర్ ఉండ‌డ‌మే మంచిద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top