అక్కడ గుడికి వెళ్లాలనుకుంటే చీర కట్టుకోవాలి అమ్మాయిలా అందంగా రెడీ కావాలి ఎక్కడో తేలుసా.?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ద దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత. సాధారణంగా మనం ఆలయాలుకు వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరిస్తాం. ఆడవారయితే తెలుగుదనం ఉట్టిపడేలా చీరలు కట్టుకొని వెళ్తారు. కానీ కేరళలో విభిన్న ఆచారం ఉంది.

కొల్లం జిల్లా కోట్టాన్ లో అమ్మవారి ఆలయం ఉంది. ఈ అమ్మవారు ఎంతో మహిమగలదని భక్తుల నమ్మకం. ఆలయాలకు స్త్రీ, పురుష అనే తేడా లేకుండా ఎవ్వరైనా వెళ్ళొచ్చు. కానీ ఈ ఆలయంలోని పురుషులకు అనుమతి లేదు. అనుమతి లేదంటే అసలు ఎంట్రీ లేదని కాదు. ఒకవేళ ఎవరైనా పురుషులు వెళ్లాలనుకుంటే స్త్రీలలా రెడీ అవ్వాలంట. అయితే ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి రావాలనుకునేవారికి ఇబ్బంది అవుతే..ఆలయంలోనే రెడీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు గుడి నిర్వాహకులు. అంటే చీర కట్టుకోవడంతో పాటు కళ్లకు కాటుక, పెదాలకు లిప్టిక్, తలలోపూలు పెట్టుకోవాలి. ఇలా ఇంట్లోఅలంకరించుకొని గుడికి వెళ్లడం కష్టం కదా. అందుకే గుడికి రావాలనుకునే వారికి ఈ సౌకర్యం కల్పించారు.

ఆరోగ్యం, వివాహం, విద్య, ఉద్యోగం.. ఏ సమస్య వచ్చినా ఇక్కడి అమ్మవారిని వేడుకుంటే సమస్యలు తీరిపోతాయని భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీరగానే ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిం చుకొంటారు భక్తులు. అయితే,ఈ ఆచారం పాటింటడం వెనుక చాలా మంది రకరకాలుగా చేప్తుంటారు. కొంతమంది పశువుల కాపరులు చీరలు కట్టుకొని దగ్గర్లో ఉన్న ఒక రాయికి పూజలు చేసి. అందులో “కొట్టాన్‌’గా పిలిచి గుడి కట్టారట. అప్పట్నుంచి పురుషులు స్త్రీ వేషధారణలో ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు స్థానికులు. ఓ సారి కొబ్బరికాయను ఈ రాయికేసి కొడితే రక్తం వచ్చిందట. అప్పట్నుంచి ఈ రాయిని పవిత్ర మైనదిగా భావించి పూజలు చేస్తున్నారు. ఈ రాయి పరిమాణం రోజు రోజు పెరుగుతూ వస్తోందట..

Comments

comments

Share this post

scroll to top