ఆ 4 దేశాల్లో “కాస్టింగ్ కౌచ్” అనేది లేదంట..! ఎందుకో తెలుసా.? కారణం ఆ చట్టం..!

క్యాస్టింగ్ కౌచ్..ప్రస్తుతం ఈ పదం తెలియనివారుండరేమో..గత నెలరోజులుగా ప్రతిరోజు ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది.మొదట్లో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా నేడు ఒక్కొక్కరూ జూనియర్ ఆర్టిస్టులు కూడా తమ బాదలు చెప్పుకుంటున్నారు.ఎన్నోఏ‌ళ్లుగా సాగుతున్న ఈ దురాగతాన్ని నిర్మూలించాలంటూ అందరూ గళం వినిపిస్తున్నారు. అయితే లింగ వివక్ష లేని కొన్నిదేశాల్లో క్యాస్టింగ్ కౌచ్‌ అనే పదమే వినిపించదు.ఆ దేశాలు ఏవి..ఆయ దేశాల గురించి కొన్ని వివరాలు..

  • మహిళల్ని గౌరవించడంలో ఐస్‌ల్యాండ్‌ది ప్రధమస్థానం. ఇంటర్‌నెట్‌లో ఫోర్నోగ్రఫి ఈ దేశం పూర్తిగా అరికట్టింది. సినిమాల‌ విషయంలోనూ సెన్సార్ బోర్డు ఖచ్చితంగా పనిచేస్తుంది. మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించే ఎలాంటి వీడియోకీ ఇక్క‌డ తావుండదు. అలాగే పార్లమెంట్‌లోని సగం సీట్లు మహిళలకు త‌ప్ప‌నిస‌రిగా కేటాయిస్తారు.
  • ఫిన్‌ల్యాండ్ దేశంలో సమానత్వ హక్కు చట్టం అమ‌లులో ఉంది. ఫ‌లితంగా పురుషులతో సమానంగా మహిళలకీ హక్కులుంటాయి. కళాశాల, కార్యాలయాల్లోనూ మహిళలకు సమాన హక్కులు లభిస్తున్నాయి.
  • అత్యధికంగా మాతృత్వ సెలవులు ఇస్త్తున్న దేశం స్వీడన్. ప్రసవానంతరం 69 వారాలపాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు.అందుకే ఈ దేశంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య నూటికి 77శాతంగా ఉంది.
  • అదే విధంగా యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో అన్ని రంగాల్లోనూ మహిళలు అగ్రస్థానంలో ఉంటున్నారు.ఆయా దేశాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించిన వ్యాఖ్యలు వినపడవు.

Comments

comments

Share this post

scroll to top