అఖిల్ రివ్యూ & రేటింగ్( తెలుగులో…)

Cast & Crew: 

నటీనటులు: అఖిల్, సయేషా సైగల్, రాజేంద్ర ప్రసాద్, మహేష్ మంజ్రేకర్
దర్శకత్వం : వి.వి. వినాయక్
నిర్మాత : శ్రేష్ట్ మూవీస్
సంగీతం : అనూప్ రుబెన్స్, థమన్

Story:
సూర్యుని నుండి ఏర్ప‌డిన భూమికి, సూర్యుని వేడి కార‌ణంగానే ప్ర‌మాదం ఉంద‌నేది ఎప్పుడో మ‌న పూర్వీకులు చెప్పారు. అయితే దానికి వారే స‌మాధానాన్ని కూడా క‌నిపెట్టారు. అదే ప‌వ‌ర్ ఆఫ్ జువా. లోహ‌గోళ‌మైన ప‌వ‌ర్ ఆఫ్ జువాను భూమ‌ద్య‌రేఖ వ‌ద్ద నున్న‌ ఓజో అనే ఆఫ్రికా తెగ‌వారు సంర‌క్షిస్తుంటారు. అయితే ఖ‌త్రోచి అనే ర‌ష్య‌న్ ప‌వ‌ర్ ఆఫ్ జువా గురించి తెలుసుకుని అది త‌న వ‌ద్ద ఉంటే త‌న‌కు మంచిద‌ని దాన్ని తెచ్చి పెట్ట‌మ‌ని ముఖేష్‌(మ‌హేష్ మంజ్రేక‌ర్‌), మాంబో అనే ఆఫ్రిక‌న్‌కు అప్ప‌గిస్తారు. ఓజో జాతిపై జ‌రిగే దాడిలో వాళ్ళు దాన్ని బోడో అనే యువ‌కుడికిచ్చి దాన్ని వ‌చ్చే సూర్య‌గ్ర‌హ‌ణం వ‌ర‌కు కాపాడ‌మంటారు. వారి నుండి త‌ప్పించుకునే క్ర‌మంలో బోడో ఓ జ‌లపాతంలో ప‌వ‌ర్ ఆఫ్ జువాను దాచేసి యూర‌ప్ వెళ్ళిపోతాడు. మ‌రోవైపు అనాథ అయిన అఖిల్‌(అఖిల్‌), దివ్య‌ను మొద‌టి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ‌కోసం దివ్య పెళ్ళి చెడ‌గొడ‌తాడు. చ‌దువుకోసం యూర‌ప్ వెళ్ళిన దివ్య‌ను అఖిల్ ఫాలో అవుతాడు. అక్క‌డే దివ్య‌కు బోడో ప‌రిచ‌యం అవుతాడు. విల‌న్ గ్యాంగ్ జ‌రిపే దాడిలో బోడో చ‌నిపోతాడు. ప‌వ‌ర్ జువా సీక్రెట్ దివ్య‌కు బోడో, చెప్పి ఉంటాడ‌నే ఉద్దేశంతో ఆమెను మాంబో అండ్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తారు. దాంతో అఖిల్ రంగంలోకి దిగి దివ్య‌ను కాపాడాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలో అఖిల్ ఎలాంటి ప‌రిస్థిత‌లను ఎదుర్కొంటాడు? ప‌వ‌ర్ ఆఫ్ జువాను అఖిల్ క‌నుక్కొంటాడా? ఓజో తెగ‌వారు, అఖిల్‌ను ఎలా క‌లుస్తారు? చివ‌ర‌కు ప్ర‌పంచాన్ని అఖిల్ కాపాడాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

PLUS POINTS:

  • అఖిల్ పర్ఫామెన్స్, డ్యాన్స్, యాక్షన్
  • వినాయక్ డైరెక్షన్
  • BGM
  • సినిమాటోగ్రఫి.

MINUS POINTS

  • రొటీన్ స్టోరీ లైన్
  • సెకండాఫ్
  • గ్రాఫిక్స్
  • మ్యూజిక్.

Verdict: అఖిల్ లాంచింగ్ అనుకున్న రేంజ్ లో కాకపోయిన ఓ స్థాయిలో సక్సెస్ అయ్యాడు.

Ratting: (2.75/5)

Trailer:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top