అంబానీ కొడుకు పెళ్లి ఫిక్స్.? వధువు ఎవరి కూతురో తెలుసా.? ఆమె గురించి ఆసక్తికర విషయాలివే.!

అంబాని ఇంట పెళ్లి బాజా మోగనుందా ..ముఖేశ్ అంబాని కొడుకు ఆకాశ్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నారా ..అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.గతంలోనే ఆకాశ్ అంబాని పెళ్లి గురించి వార్తలొచ్చాయి.పెళ్లి పత్రిక లక్షలు విలువ చేస్తుందనే కామెంట్స్ వినిపించాయి..కాని అవన్ని వట్టి మాటలే అని కొట్టిపారేశారు.కాని ఇప్పుడు ఆకాశ్ వరుడు కాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకి ఆకాశ్ చేసుకోబోయేది ఎవర్నో తెలుసా?

వధువు పేరు శ్లోక..

ఆకాశ్‌, శ్లోక- ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. ముకేశ్‌, నీతా అంబానీ దంపతులకు ముగ్గురు పిల్లలు.వారిలో ఆకాశ్‌,  ఇషా తొలి సంతానం…వీరిద్దరూ కవలలు. రిలయన్స్‌ గ్రూపులో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న ‘జియో’ బోర్డులో ఆకాశ్‌ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాఠశాల విద్య పూర్తయ్యాక శ్లోక 2009లో ఆంత్రోపాలజీ చదివేందుకు ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీకి వెళ్లారు.తర్వాత ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌’లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. 2014 నుంచి రోజీ బ్లూ ఫౌండేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె ‘కనెక్ట్‌ఫర్‌’ సహవ్యవస్థాపకురాలు కూడా. ఈ సంస్థ స్వచ్ఛంద సంస్థలకు, వారికి అవసరమైన కార్యకర్తలకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంటుంది.

ఇంతకి శ్లోక  ఎవరు?వివాహం ఎప్పుడు?

రస్సెల్‌ మెహతా అధిపతిగా ఉన్న ‘రోజీ బ్లూ’… ప్రపంచంలో అతి పెద్ద వజ్రాభరణాల సంస్థ. బెల్జియం కేంద్రంగా నడుస్తున్న రోజీ బ్లూ… 50 ఏళ్ల క్రితం బి.అరుణ్‌కుమార్‌ పేరిట వ్యాపారం ప్రారంభించింది. 1973లో దిలీప్‌ మెహతా సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించడానికి అడుగులు వేసింది. రోజీ బ్లూకు ఒరా పేరిట మన దేశంలో సుమారు 30 దుకాణాలు ఉన్నాయి.రస్సెల్‌, మోనా మెహతా ముగ్గురు పిల్లల్లో శ్లోక ఆఖరి సంతానం..అంబానీ, మెహతా కుటుంబాలు ఒకరికొకరు బాగా పరిచయస్థులే..ముకేశ్‌ అంబానీ, రోజీ బ్లూ డైమండ్స్‌ అధిపతి రస్సెల్‌ మెహతా వియ్యంకులు కాబోతున్నారా? ముకేశ్‌ కుమారుడు ఆకాశ్‌ అంబానీ, రస్సెల్‌ కుమార్తె శ్లోక మెహతా మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారా?వీరిద్దరి పెళ్లి గురించి రెండు కుటుంబాలు ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయకపోయినా… వారి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం కొన్ని వారాల్లో నిశ్చితార్థం, డిసెంబరులో పెళ్లి చేయాలని భావిస్తున్నారని సమాచారం.

Comments

comments

Share this post

scroll to top