ఆకలితో ఏడుస్తున్న పసిపాపకు తన రొమ్ముపాలను పట్టిన మహిళా పోలీస్..!

దేశ రక్షణకు AK-47 గన్నులనే పట్టే వీర జవానే కాదు…అవసరమైతే ఆకలితో బాధపడే పసిపాపకు తన రొమ్ముపాలు పట్టించే తల్లిని కూడా అని చాటిచెప్పింది ఆ మహిళా పోలీస్. కొలొంబో కు చెందిన లూసా ఫెర్నాండా తన డ్యూటీ పనిమీద తుళువ అనే గ్రామానికి వెళ్లింది.. తన పనిలో తాను బిజీగా ఉండగా  ఓ పసిపాప ఏడుపు వినిపించింది…ఎక్కడా అని వెతికి చూడగా ఓ చెత్తకుప్ప దగ్గర ఓ చిన్న పసికందు గుక్కపట్టి ఏడ్వడం కనిపించింది. పసిపాపను చూసిన లూసా వెంటనే  తన చేతుల్లోకి తీసుకుంది. ఏడుస్తున్న పాపను ఓదార్చడానికి చాలా ప్రయత్నించింది.


పసిపాప ఏడుపు విని అక్కడ  గ్రామస్తులతో పాటు ఆమె పై ఆఫీసర్లు కూడా పోగయ్యారు. అంతలోనే లూసా తను వేసుకున్న పోలీస్ డ్రెస్ షర్ట్ ను కాస్తంత పక్కకు జరిపి గుక్కపట్టి ఏడుస్తున్న పాపకు తన పాలను  పట్టించింది. అప్పటి వరకు ఏడ్చిన పాప ..లూసా పాలు తాగి ఏడుపు మానేసి నిద్రలోకి జారుకుంది. పాప తదుపరి లాలన,పాలను కొరకు పాపను కొలంబియన్ ఫ్యామిలీ వెల్పేర్ ఇన్సిస్ట్యూషన్ కు తరలించారు. లూసా చేసిన పనికి అక్కడున్న గ్రామస్తులతో పాటు, ఆమె పై ఆపీసర్లు కూడా  మెచ్చుకున్నారు.


అయినా…నీకు పాలెలా.. వచ్చాయ్ అని అడగ్గా?  తనకు కూడా ఇంకా పాలు తాగే పాప ఉందని తెలిపింది లూసా..! అందుకేనేమో… ఆడతనం ఒక్కొక్క దేశంలో ఒక్కో విధంగా ఉన్నా…తల్లితనం మాత్రం ఏ దేశంలోనైనా ఒకే విధంగా ఉంటుందంటారు

Comments

comments

Share this post

scroll to top