ఆక‌లికి తాళ‌లేక దొంగ‌త‌నం చేశాడ‌ని చంపేశారు.! అతన్ని చితకబడుతూ సెల్ఫీలు తీసుకున్నారు..! తప్పు ఎవరిది.?

వేల కోట్ల రూపాయ‌ల‌ను బ్యాంకుల నుంచి అప్పుల రూపంలో తీసుకుని వాటిని క‌ట్ట‌కుండా దేశం విడిచి పారిపోయే వెధ‌వ‌ల‌ను మాత్రం మ‌నం ఏమీ చేయ‌లేం. కానీ పొట్ట కూటి కోసం చిన్న చిన్న దొంగ‌త‌నాల‌ను చేసే వారిని మాత్రం ఉపేక్షించం. తీవ్రంగా కొడ‌తాం, వారిని హింసిస్తాం. చివ‌ర‌కు చంపేస్తాం. అవును, నేటి స‌మాజంలో కొంద‌రు ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకు కేర‌ళ‌లోని ఆ ప్రాంతంలో ఉన్న‌వారే ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. అవును, మీరు విన్నది క‌రెక్టే. వారు ఆక‌లి కోసం చిన్న దొంగ‌త‌నం చేసిన వ్య‌క్తిని చిత‌క‌బాదారు. తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ వ్య‌క్తి మృతి చెందాడు. దారుణ‌మైన ఈ ఘ‌ట‌న జ‌రిగింది కేర‌ళ‌లో.

కేర‌ళ‌లోని అట‌ప్ప‌డి అనే ప్రాంతంలో నివాసం ఉండే మ‌ధు (30) అనే ద‌ళితుడు స్థానికంగా ఉండే అడ‌విలో నివాసం ఉంటున్నాడు. అడ‌విలో చెట్ల కింద‌, గుహ‌ల్లో ఉంటూ రాత్రి పూట షాపుల్లో బియ్యం, ప‌ప్పు లాంటి తిండికి అవ‌స‌ర‌మ‌య్యే సామ‌గ్రిని దొంగిలించేవాడు. అయితే మ‌ధు దొంగ‌తనం చేస్తుండ‌గా షాపుల్లో ఉండే సీసీ టీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ‌య్యాయి. దీంతో 15 మంది వ్య‌క్తులు క‌లిసి మ‌ధు ఉండే ప్రాంతానికి వెళ్లి అత‌న్ని కొట్టి అత‌న్ని తాళ్ల‌తో క‌ట్టేసి అట‌ప్ప‌డికి తీసుకువ‌చ్చారు. అనంత‌రం వారంద‌రూ సామూహికంగా అత‌నిపై దాడి చేశారు. చిత్ర హింస‌లు పెట్టారు. చిత‌క‌బాదారు. ఈ క్ర‌మంలోనే మ‌ధును కొట్టేట‌ప్పుడు కొంద‌రు వీడియోలు తీసుకున్నారు. కొంద‌రు సెల్ఫీలు తీసుకున్నారు.

అలా మ‌ధును కొట్టాక వారు అత‌న్ని పోలీసుల‌కు అప్ప‌గించారు. అయితే పోలీసుల క‌స్ట‌డీలో ఉన్న మ‌ధుకు తీవ్ర అస్వ‌స్థ‌త క‌లిగింది. దీంతో అత‌న్ని పోలీసులు స్థానికంగా ఉన్న కొట్టాత‌ర‌లోని ప్ర‌భుత్వ గిరిజన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే తీవ్రంగా వాంతులు చేసుకున్న మ‌ధు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌ధును కొట్టిన వారిని గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. అయితే మ‌ధును కొట్టేప్పుడు ఓ వ్య‌క్తి న‌వ్వుతూ తీసుకున్న సెల్ఫీతోపాటు అత‌న్ని ప‌ట్టుకున్న‌ప్పుడు తీసిన ఓ వీడియో కూడా ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలో ఈ ప‌ని చేసిని వారిని నెటిజ‌న్లు పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్నారు. ఆక‌లికి తాళ‌లేక చిన్న దోంగ‌త‌నం చేస్తే అంత పెద్ద శిక్ష ఎందుకు వేస్తారు అంటూ సామాజిక కార్య‌క‌ర్త‌లు కూడా మండిప‌డుతున్నారు. అవును మ‌రి, మ‌న స‌మాజం అలా ఉంది, ఏం చేస్తాం మ‌రి. అందుకే క‌దా, విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోదీ లాంటి వారు వేల కోట్ల రూపాయ‌లు దోచేసి విదేశాల‌కు చెక్కేస్తున్న‌ది. ఏది ఏమైనా ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా దారుణం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top