“ఎంత వాడు గాని”లో “అజిత్” కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? రెండేళ్లలో ఎలా మారిందో చూడండి!

ఎంతవాడుగానీ సినిమాలో నీకేం కావాలో చెప్పు,లోకం అంతా చూడాలా చెప్పు అంటూ తన కూతుర్ని ఉద్దేశిస్తూ అజిత్ పాడిన పాట పాడుకోనివారుండరు..ఆ సినిమాలో సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా అజిత్ కనపడతారు..డ్యాన్సర్ గా ,భర్త నుండి విడిపోయి కూతుర్ని చూసుకుంటున్న తల్లిగా త్రిష నటించింది.వీరిద్దరి మధ్యా లవ్….వీరి కూతురుగా అనిక నటించింది..కూతురు కోసం ప్రాణం ఇచ్చే తండ్రిగా అజిత్ నటన ఎలా ఉంటుందో మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు..కానీ పదకొండేళ్ల అనికా ఎక్కడా తొనక్కుండా ,బెనక్కుండా నటించింది..ఇప్పుడు హీరోయిన్లతో పోటీ పడుతున్నట్టుగా మారిన అనికాను చూసి ఔరా అనుకోకుండ ఉండలేరు..

ఐదేళ్ల వయసు నుండి నటిస్తున్న అనికా ఇప్పటివరకు పదికి పైగా సినిమాల్లో నటించింది..అజిత్,మమ్ముట్టి,దుల్కర్ సల్మాన్ లాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా కేరళ ప్రభుత్వం నుండి అవార్డు కూడా అందుకుంది.ఎంతవాడు గానీ సినిమా వచ్చి రెండేళ్లయింది..ఆ సినిమా చేస్తున్నప్పటికి అనికాకి పదకొండేళ్లు.. ఇప్పుడు పదమూడేళ్ల  అనికా ఎలా ఉందో తెలుసా… అచ్చం హీరోయిన్లా..అందుకే నెటిజన్లంతా సోషల్ మీడియాలో తన ఫోటోస్ చూసి అవురా అని ముక్కున వేలేసుకుంటున్నారు.రేపో మాపో ఇప్పటి హీరోయిన్లకు పోటీ రాబోతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.శ్రీదేవి,రాశి,షాలిని,షామిలి వీళ్లంతా బాలనటులుగా వారి ప్రస్థానం మొదలుపెట్టినవారే..వీళ్లల్లో శ్రీదేవి చిన్న వయసులో పదహారేళ్ల వయసులో హీరోయిన్ గా నటించింది..నాటి హీరోలు ఎన్జీఆర్,ఎఎన్ ఆర్ లతో పాటు,నాగార్జున,చిరంజీవిలతో కూడా నటించిన ఘనత శ్రీదేవిది..ఛార్మీ మొదటిసినిమా చేసే టైం కి తన వయసు పదమూడేళ్లు… మరి అనికా ప్రస్థానం ఎలా ఉండబోతుందో లెట్స్ సీ…

Comments

comments

Share this post

scroll to top