మిస్సెస్ ఇండియా ఫైన‌ల్ లో హీరో/ క‌్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అజ‌య్ భార్య‌!!

అజయ్ తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టు..తన పేరుతో కన్నా తను చేసిన క్యారెక్టర్స్ ద్వారానే ఎక్కువ గుర్తింపు పొందిన నటుడు..విక్రమార్కుడులో విలన్,ఇష్క్ లో నిత్యా అన్నయ్య, పోకిరిలో మహేశ్ ఫ్రెండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చేసిన ప్రతి క్యారెక్టర్ లో అలా ఒదిగిపోయేవాడు.. విలన్ పాత్రలతో పాటు రెండు సినిమాల్లో హీరోగా కూడా చేసారు అజయ్ ..కానీ అవి అంత గుర్తింపు తీస్కురాలేదు..కానీ ఇప్పుడు వార్తల్లో నిలిచి రియల్ హీరో అయ్యారు…దీనికి కారణం తన భార్య శ్వేతా రావూరి….

అజయ్ ,శ్వేత లకు 2006లో పెళ్లైంది..వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు…శ్వేతా రావురి మిస్సెస్  ఇండియా పోటీలో పోటీపడీ..ఫైనల్ కు చేరుకున్నారు..ఈ విషయం తెలియగానే శ్వేతా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు..తాను ఈ స్థానానికి చేరుకోవడానికి తన భర్త సహకారం ఎంతో ఉందని ఆమె గర్వంగా చెప్తుంది…నిజమే అందంగా ఉండడం,ఫిట్ గా ఉండడం పెళ్లయ్యాక కొంచెం కష్టమే అని చెప్పాలి..అందులో ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఫిట్ గా ఉండడం చాలా ఆశ్చర్యం..

హాట్‌ మోంద్‌’ నిర్వహించిన 2017 మిసెస్‌‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పోటీల్లో ఆమె ఫైనల్‌ రౌండ్‌కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అజయ్‌ కూడా ఫేస్‌బుక్‌ ద్వారా తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. తన భార్య చివరి రౌండ్‌కు ఎంపిక కావడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఆమె ఫేస్‌బుక్‌ పేజీని షేర్‌ చేస్తూ.. దయచేసి లైక్‌ చేసి, తనను ఆశీర్వదించండని కోరారుఫైనల్ లిస్ట్ లో శ్వేత ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి.. ఒకవేళ మిస్సెస్ ఇండియా కిరీటం గెలిస్తేనా తెలుగు వారికి మరొక ఘనత వచ్చినట్లే. గతంలో మరో తెలుగు తేజం.. మోడల్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ఇదే తరహాలో మిస్సెస్ ఇండియా కిరీటం గెలుచుకుంది.

ఆడపిల్లలు ఏ పనైనా చేయాలంటే తల్లిదండ్రి అనుమతి ఉండాలి అదే పెళ్లయిన వారు భర్త,అత్తమామల సహకారం ఉండాలి… ఆడపిల్లల ఉనికే ప్రశ్నార్దకం అవుతున్న ఈ రోజుల్లో అజయ్ తన భార్య ఇష్టాఇష్టాలను గౌరవించి,తనని ప్రోత్సహించి రియల్ హీరో అయ్యారు..

Comments

comments

Share this post

scroll to top