ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఈ 29 ఏళ్ల యువకుడు “ఐశ్వర్య రాయ్” కొడుకంట.! ప్రూఫ్ ఏం చుపించాడంటే?

ఐశ్వ‌ర్యారాయ్‌.. బాలీవుడ్ ఎవ‌ర్‌గ్రీన్ బ్యూటీ ఈమె. ఎప్పుడు చూసినా య‌వ్వ‌నంగానే క‌నిపిస్తుంది. ఆమె అస‌లు ఏజ్ ఎంతో ఎవ‌రూ చెప్ప‌లేరు అన్నంత అందంగా ఆమె ఉంటుంది. పెళ్ల‌య్యాక అస‌లు సినిమాల వైపు చూడ‌డ‌మే మానేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆరాధ్య పుట్టాక వెండి తెర‌కు చాలా దూరంగా ఈమె ఉంటోంది. అయిన‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న‌కు ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఐశ్వ‌ర్యారాయ్ ద‌ర్శ‌న‌మిస్తూనే ఉంది. అయితే ఇంత‌కీ ఇప్పుడు విష‌యం ఏమిటంటే.. ఐశ్వ‌ర్యారాయ్‌కు ఆరాధ్య కాకుండా ఇంకో కుమారుడు ఉన్నాడ‌ట‌. అది కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌లో..! ఏంటీ షాకింగ్‌గా ఉందా..! అవును మ‌రి, ఎవ‌రైనా షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అత‌ని పేరు సంగీత్ కుమార్‌. ఉంటున్న‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ ప‌ట్నంలో. ఇత‌ను తాజాగా మీడియా ముందుకు వ‌చ్చాడు. తాను ఐశ్వ‌ర్యారాయ్ కొడుకునని చెప్పాడు. లండ‌న్‌లో ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిలో తాను ఐశ్వ‌ర్యారాయ్‌కు 1998లో జ‌న్మించాన‌ని అన్నాడు. అంతేకాదు, ఐశ్వ‌ర్యారాయ్ త‌ల్లిదండ్రులు త‌న‌కు 2 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు త‌మ ద‌గ్గ‌రే ఉంచుకుని పెంచుకున్నార‌ని అన్నాడు. అనంత‌రం ఆదివేలు రెడ్డి అనే వ్య‌క్తి త‌న‌ను తండ్రిలా పెంచుకున్నాడ‌ని చెప్పాడు. దీంతో ఇప్పుడిత‌ని వార్త నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

అయితే సంగీత్ కుమార్ అలా తాను ఐశ్వ‌ర్యారాయ్ కొడుకున‌ని చెప్ప‌గానే మీడియా వారు ప్ర‌శ్నలు అడిగారు. అందుకు ప్రూఫ్ ఉందా అనేసరికి సంగీత్ బ‌దులిస్తూ.. అలాంటి ప్రూఫ్‌లు ఏవీ లేవ‌ని, వాటిని త‌న బంధువులు నాశ‌నం చేశార‌ని అన్నాడు. ఎలాగైనా త‌న‌కు న్యాయం చేయాల‌ని, తాను త‌ల్లి అయిన ఐశ్వ‌ర్యారాయ్ వ‌ద్ద‌కు చేరుకుంటాన‌ని, ఆమె వ‌ద్దే ఉంటాన‌ని అంటున్నాడు. అయితే ఈ విష‌యంలో నిజం ఎంత ఉందో తెలియ‌దు కానీ.. ఇప్పుడీ వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చూద్దాం మ‌రి.. చివ‌ర‌కు ఏమ‌వుతుందో..!

Comments

comments

Share this post

scroll to top