“జియో” కి ధీటుగా “ఎయిర్టెల్” సరికొత్త ఆఫర్..! మొన్నటివరకు తిట్టిన వాళ్ళే ఇకపై “ఎయిర్టెల్” కావాలంటారు!

మొదట 3 నెలలు ఆరంభం ఆఫర్, తరవాత 3 నెలలు న్యూ ఇయర్ ఆఫర్, తరవాత సమ్మర్ సర్ప్రైస్ ఆఫర్. ఇప్పుడు “ధన్ ధనా ధన్” ఆఫర్ తో కేవలం 309 రూపాయలకే ఉచిత డేటా, కాల్స్ ప్రకటించి ప్రత్యర్థులకు పెద్ద షాక్ ఇచ్చింది “రిలయన్స్ జియో”. ఈ ఆఫర్ కు వ్యతిరేకంగా “ఎయిర్టెల్” ట్రై కు రిపోర్ట్ చేసింది. కానీ రిలయన్స్ జియో ఈ ఆఫర్ ను వెనక్కి తీసుకునే ప్రశక్తే లేదని తేల్చి చెప్పడంతో “ఎయిర్టెల్” చేసేదేమి లేక ఈ కొత్త ఆఫర్ ను ప్రకటించింది..!

సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. కొత్త ప్లాన్‌ ప్రకారం రూ. 399తో రీచార్జి చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ 4జీ డేటా వస్తుంది, దాంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. అయితే, ఇదంతా 4జీ సిమ్‌ కార్డుతో పాటు 4జీ సదుపాయం ఉన్న ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది.  రిలయన్స్‌ జియో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,డేటా ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recharge Rs. 399/-

  • 70 days validity
  • Daily 1GB 4G Data
  • Unlimited Free Voice Calls

Comments

comments

Share this post

scroll to top