రూ.1399కే ఎయిర్‌టెల్‌ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్‌..!

గ‌త కొన్ని నెల‌ల క్రితం జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫోన్‌పై యూజ‌ర్లు బాగా ఆస‌క్తిని క‌న‌బరిచారు. మొత్తం 60 ల‌క్షల మంది ఈ ఫోన్ ను బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఫోన్‌కు ఉన్న ఇంట్రెస్ట్‌ను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ కూడా తాజాగా ఓ 4జీ ఫోన్‌ను విడుద‌ల చేసింది. అయితే జియోలా ఈ ఫోన్ ఫీచ‌ర్ ఫోన్ కాదు, స్మార్ట్‌ఫోన్‌. ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఇందులో ఉంది. 4జీ వీవోఎల్‌టీఈ స‌దుపాయం కూడా ఉంది. కాగా ఈ ఫోన్‌ను ఎయిర్‌టెల్ కార్బ‌న్ సంస్థ‌తో క‌లిసి త‌యారు చేసింది. కార్బ‌న్ ఎ40 ఇండియ‌న్‌ పేరిట ఈ ఫోన్‌ను ఎయిర్‌టెల్ విడుద‌ల చేసింది. ఈ ఫోన్ త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా రీటెయిల్ స్టోర్స్ లో ల‌భ్యం కానుంది.

ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ కార్బన్ ఎ40 ఇండియ‌న్ ఫోన్ ధర రూ.1399 మాత్రమే. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే ముందుగా వినియోగదారులు రూ.2899 చెల్లించాలి. అనంతం 36 నెలల పాటు నెలకు రూ.169 ఆపైన రీచార్జి కచ్చితంగా చేసుకోవాలి. అలా చేసుకుంటే 18 నెలల తరువాత రూ.500 తిరిగిచ్చేస్తారు. మళ్లీ 18 నెలల పాటు ఇలాగే రూ.169 ఆపైన రీచార్జి చేసుకుంటే 36 నెలల తరువాత రూ.1000 తిరిగిస్తారు. దీంతో వినియోగదారులకు మొత్తం రూ.1500 తిరిగి వెనక్కి వ‌స్తాయి. ఇలా ఫోన్ ధర రూ.1399 మాత్రమే అవుతుంది.

ఇక 4జీ ఫోన్‌తోపాటే రూ.169 పేరిట కొత్త ప్లాన్‌ను ఎయిర్‌టెల్ విడుదల చేసింది. దీని వాలిడిటీ 28 రోజులు. రోజుకు 500 ఎంబీ 4జీ డేటా ఉచితంగా వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే పైన చెప్పినట్టుగా వినియోగదారులు రూ.1500 మొత్తాన్ని రీఫండ్‌గా పొందాలంటే రూ.169 ప్లాన్‌ను కచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ ప్లాన్ వద్దనుకుంటే ఇతర ప్లాన్లను కూడా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే 18 నెలల వ్యవధిలో చేయించుకునే రీచార్జిలు రూ.3వేలు ఆపైన విలువ కలిగి ఉండాలి. దీంతోనే మొదటి 18 నెలల అనంతరం రూ.500 నగదు వెనక్కి వస్తుంది. మళ్లీ 18 నెలల వ్యవధిలో కూడా రూ.3వేలు ఆ పైన విలువ కలిగిన ప్యాక్‌లను రీచార్జి చేసుకోవాలి. దీంతో 36 నెలల అనంతరం రూ.1000 వెనక్కి వస్తుంది.

కార్బన్ ఎ40 ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్‌లో 4 ఇంచ్ డిస్‌ప్లే, 800 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్, వైఫై, 1400 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉన్నాయి..!

Comments

comments

Share this post

scroll to top