“ధన్ ధనా ధన్” ఆఫర్ అమలులోకి రాదా..? “ట్రయ్” తో కలిసి “ఎయిర్టెల్” ఏం చేసిందో తెలుసా..?

మొదట మూడు నెలలు ఉచిత కాల్స్, డేటా..తరవాత న్యూ ఇయర్ ఆఫర్ కింద మరో మూడు నెలలు పొడిగింపు..ఇటీవలే సమ్మర్ సుర్ప్రైస్ ఆఫర్ అని “303 ” రూపాయలకే మూడు నెలలు ఉచిత డేటా, కాల్స్ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. కానీ ట్రై దీనికి వ్యతిరేకం చెప్పింది. ఇక జియో దూకుడుకు అడ్డుకట్ట పడినట్టేనని భావించాయి.  అక్కడితో ఆగకుండా dth సేవల్లోకి మరియు లాప్టాప్ రంగంలోకి కూడా “రిలయన్స్ జియో” అడుగుపెట్టనుంది. ఇలా ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న “జియో” ఇటీవలే “ధన్ ధనా ధన్” ఆఫర్ తో ముందుకొచ్చింది!

జియో కొత్త ప్లాన్స్ ఇవే..

1 GB ప్లాన్( ప్రతిరోజూ 1 GB)
జియో ప్రైమ్ మెంబర్స్ : రూ 309 : 84 రోజుల వ్యాలిడిటీ

నాన్ జియో ప్రైమ్ : రూ. 349 : 84 రోజుల వ్యాలిడిటీ

కొత్త కస్టమర్లు : రూ. 99+309= 408 : 84 రోజుల వ్యాలిడిటీ

2 GB ప్లాన్( ప్రతిరోజూ 2 GB)
జియో ప్రైమ్ మెంబర్స్ : రూ 509 : 84 రోజుల వ్యాలిడిటీ

నాన్ జియో ప్రైమ్ : రూ. 549 : 84 రోజుల వ్యాలిడిటీ

కొత్త కస్టమర్లు : రూ. 99+509=608 : 84 రోజుల వ్యాలిడిటీ

దీనిపై “ఎయిర్టెల్” విరుచుకుపడింది…TRAI కు ఏమని లేఖ రాసిందో చూడండి!

“TRAI అథారిటీ “జియో” కొత్త ఆఫర్ ను వ్యతిరేకించాలి. జియో చేసిన పనికి మేము ఆశ్చర్య పోతున్నాము. TRAI ఆదేశాలను ఉల్లంఘించింది. “సమ్మర్ సర్ప్రైస్ ఆఫర్” ను TRAI అంగీకరించలేదు. జియో ఆ ఆఫర్ ను వెనక్కి తీసుకుంది. కానీ నిన్న అదే ఆఫర్ ను “ధన్ ధనా ధన్” ఆఫర్ అని విడుదల చేసింది. పాత మందునే కొత్త బాటిల్ పోసి అమ్మినట్టు ఉంది ఇది.

జియో వల్ల మేము భారత టెలికాం సంస్థ పడిపోయేలా ఉంది. మాకు బిజినెస్ రన్ చేయడానికి కాపిటల్ కూడా లభించట్లేదు. ఇలా అయితే మిగిలిన కంపెనీలు మూసుకోవాల్సిందే.

అంబానీ గారు మూడు నెలలు పొడిగించిన ఆఫర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలి”

Comments

comments

Share this post

scroll to top