విశాఖ ఎయిర్పోర్ట్ లో “టీడీపీ జేసీ దివాకర్ రెడ్డి” చేసిన రచ్చకి ఈ ఏడు విమానాల్లో ఆయన ఎక్కడానికి లేదు..!

విశాఖ ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోయారు. బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వడం లేదంటూ ఇండిగో సిబ్బందిపై దాడి చేశారు. కౌంటర్ లోపలికి వెళ్లి ఫర్నిచర్‌, ప్రింటర్ లను విసిరేశారు. దివాకర్‌ రెడ్డి ఆలస్యంగా వచ్చారని, ఆయన ఎయిర్‌ పోర్టుకు వచ్చేలోపే సమయం ముగియడంతో కౌంటర్ మూసేశామని సిబ్బంది చెప్తున్నారు.

ఈ ఘటనపై వివరణ ఇచ్చిన జేసీ.. తాను ఎవ్వరిపై దాడి చేయలేదని, ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేవలం సిబ్బందిని ప్రశ్నించానని, స్నేహపూర్వకంగానే తోసేశానని చెప్పారు. ఇప్పటికే ఇండిగో ఉన్నతాధికారులకు, పౌర విమానయాన మంత్రి అశోక గజపతిరాజుకు ఫిర్యాదు చేశానన్నారు జేసీ. సిసి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్లో దివాకర్ రెడ్డి చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నా ఆయన కొట్టిపారేయడం విశేషం.

watch video here:

ఆయన చేసిన ఈ నిర్వాకానికి ఇండిగో, ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్, విస్తార, ఎయిర్ ఆసియ విమానాలు ఆయనను బాన్ చేసాయి. ఆయన ఇకపై ఆ ఫ్లైట్స్ ఎక్కడానికి వీలు లేదు!

Comments

comments

Share this post

scroll to top