ఈ ఎయిర్ హోస్టస్‌ చేసిన పని తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..!

తల్లి ప్రేమ ఎంతో స్వచ్ఛ మైనది. తల్లి పస్తు ఉండి పిల్లలకు తిండి పెడుతుంది. తన ప్రాణాలు పోయిన పర్లేదు, పిల్లోళ్ల జీవితాలు బాగుండాలి అని కోరుకొనేది ఈ ప్రపంచం లో తల్లి మాత్రమే. 24 ఏళ్ల ప్రతీషా ఆర్గానోకు ఇప్పుడందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఫిలిప్పిన్ ఎయిర్ లైన్స్‌లో ఎయిర్ హోస్టస్‌గా పనిచేస్తున్న ఆమె ఆకలితో అల్లాడిపోతున్న పరాయిబిడ్డకు పాలిచ్చి మాతృత్వపు గొప్పతనాన్ని చాటింది.


ఈ నెల 6న విమానంలో ఆమె విధులు నిర్వహిస్తున్న విమానంలోనే ఈ సంఘటన జరిగింది. ప్లేన్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ప్రయాణికురాలి బిడ్డ గుక్కపట్టి ఏడ్చింది. తల్లి దగ్గర పాలు లేవు. డబ్బా పాలూలేవు. ఏం చేయాలని ఎవరికీ అర్థం కాలేదు. 9 నెలల బిడ్డకు తల్లయిన ప్రీతీషా.. వెంటనే అక్కడికి చేరుకుంది. ఆకలితో ఏడుస్తున్న ఆ చిన్నారిని తీసుకుని చనుబాలు తాపింది. దీంతో బిడ్డ నెమ్మదించి నిద్రపోయింది. ప్రీతీషా తర్వాత తిరిగి తన విధుల్లోకి వెళ్లిపోయింది. పాలుపడుతున్నప్పుడు ప్రయాణికులు తీసిన ఫోటో,ఆమె రాసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రతి ఒక్కరు ప్రీతీషాను మెచ్చుకుంటున్నారు. నెటిజెన్ లు ప్రీతీషాను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ ఫోటోకు లక్షన్నరకుపైగా లైకులు, 34 వేల షేర్లు, వేలకొద్దీ కామెంట్లు వస్తున్నాయి. నెటిజెన్ లే కాదు, ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ప్రీతీషాను మెచ్చుకుంటున్నారు. ఆడవాళ్ళ మంచితనానికి ప్రీతీషా ఒక ఉదాహరణ. అందుకే అంటారు ఆడదానికి భూదేవి కి ఉన్నంత ఓర్పు, మాటల్లో వివరించలేనంత మంచి తనం ఉందని.

Comments

comments

Share this post

scroll to top