వేల అడుగుల ఎత్తులో, ఎయిరిండియా విమానంలో ప్ర‌యాణికుల‌కు ఊపిరి ఆడ‌లేదు. త‌రువాత ఏం జ‌రిగిందో తెలుసా..?

అవును మ‌రి. అస‌లే అది విమాన‌మాయె. ఏదైనా కొంచెం తేడా జ‌రిగినా అంతే. చిన్న నిర్ల‌క్ష్యం కూడా పెద్ద ప్ర‌మాదానికి దారి తీస్తుంది. దీంతో గాల్లో ప్రయాణించే ప్ర‌యాణికుల ప్రాణాలు గాల్లోనే క‌లిసిపోతాయి. ఇక ఆ త‌రువాత సున్నంలోకి ఎముక‌లు కూడా మిగ‌ల‌వు. క‌నీసం శిథిలాలు కూడా దొర‌క‌వు. అయితే అంత వ‌ర‌కు రాలేదు కానీ, ఓ ఎయిరిండియా విమానంలో నిజంగా పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది. అందులో ప్ర‌యాణిస్తున్న వారికి చాలా సేపు గాలి ఆడ‌లేదు. దీంతో వారు ఉక్కిరిబిక్కిర‌య్యారు. సాధార‌ణంగా విమానంలో ఉండే ఆక్సిజ‌న్ మాస్క్‌లు కూడా ప‌నిచేయ‌లేదు. దీంతో వారు తీవ్రంగా ఆందోళ‌న చెందారు. అయితే చివ‌ర‌కు అంతా స‌ర్దుకోవ‌డంతో హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నారు.

ప‌శ్చిమ బెంగాల్‌లోని బ‌గ్దోగ్రా నుంచి ఢిల్లీకి ఏఐ 880 పేరున్న ఎయిరిండియా విమానం ఒక‌టి బ‌య‌ల్దేరింది. అందులో మొత్తం 168 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. అయితే మార్గ‌మ‌ధ్య‌లో స‌డెన్‌గా ఆ విమానంలో ఏసీ ప‌నిచేయ‌లేదు, ఆగిపోయింది. అయితే, ఎవ‌రూ కంగారు పడాల్సిన పని లేదని, కొంత సేపు ఓపిక ప‌డితే వెంటనే వస్తుందని, సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగానే అలా జ‌రిగింద‌ని ఆ విమాన సిబ్బంది, పైల‌ట్లు స్వ‌యంగా వ‌చ్చి మ‌రీ చెప్పారు. అయితే చాలా సేప‌టి వ‌ర‌కు ఏసీ రాలేదు. దీంతో ప్ర‌యాణికుల‌కు సరిగా ఊపిరి ఆడలేదు. వారంతా తీవ్ర ఉక్కపోతకు గుర‌వ‌డ‌మే కాదు, కొంత సేప‌టికి గాలి ఆడ‌క‌ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దీంతో వారిలో ఆందోళ‌న మొద‌లైంది.

ఈ క్ర‌మంలో విమానంలో ఉన్న ఆక్సిజన్‌ మాస్కులను కూడా వారు పెట్టుకునేందుకు య‌త్నించారు. అయితే అవి కూడా పనిచేయలేదు. దీంతో ప్రయాణీకులంతా విమానంలో ఇచ్చిన వార పత్రికలను తీసుకొని విసనకర్రల మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఒక ద‌శ‌లో వారికి ఏం జ‌రుగుతుందో అర్థం కాలేదు. తాము ప్ర‌మాదానికి గుర‌వుతామేమోన‌ని వారు భ‌య‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ప్ర‌యాణికులు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ విమాన సిబ్బందిపై అరవడం మొదలుపెట్టారు. ఈ తంతునంతా కొంతమంది ప్ర‌యాణికులు వీడియోలు తీస్తుండగా అలా చేయ‌కండి అంటూ విమాన సిబ్బంది ప్ర‌యాణికుల ఫోన్‌లను లాక్కునేందుకు య‌త్నించారు. దీంతో ప్ర‌యాణికుల‌కు, విమాన సిబ్బందికి వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే మ‌రి కాసేప‌టికి ఏసీ రావ‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. ఈ క్ర‌మంలో ఈ విష‌యంపై ఎయిర్‌ ఇండియాను మీడియా ప్రశ్నించగా సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని, విచారణకు ఆదేశించామని సంబంధిత అధికారులు చెప్పారు. సాధార‌ణంగా ఎయిరిండియా విమానాలు అంటే ప్ర‌భుత్వం న‌డిపేవి కాబ‌ట్టి కొంత అసౌక‌ర్యంగానే ఉంటాయ‌ని ప్ర‌యాణికులు కంప్లెయింట్ చేస్తుంటారు. అయితే మ‌రీ ఈ రేంజ్‌లో అసౌక‌ర్యం ఉంటుంద‌ని పాపం ఆ ప్ర‌యాణికులు ఊహించ‌లేదు. ఏది ఏమైనా ఆ విమానంలో ప్ర‌యాణికులు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ‌డం కొంత వ‌ర‌కు ఊర‌ట‌నిచ్చే విష‌యం..!

Comments

comments

Share this post

scroll to top