అఘోరాలు శవాల మధ్య ఎందుకు గడుపుతారో తెలుసా.??

కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు.

అఘోరీ అంటే సంస్కృతంలో ‘భయం కలిగించని’ అన్న అర్థం ఉంది. కానీ, వీరి వేషధారణ, అసాధారణ ఆచారవ్యవహారాలు భీతిగొలుపుతాయి.

అదేసమయంలో వీరిపట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి.

”ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను దాటి తమదైన పద్ధతులు ఆచరిస్తారు” అని లండన్‌లోని ‘స్కూల్ ఆప్ ఆఫ్రికన్, ఓరియెంటల్ స్టడీస్’ సంస్కృత బోధకుడు జేమ్స్ మాలిన్సన్ అభిప్రాయపడ్డారు.

ప్రధాన స్రవంతిలో ఉంటూ ఆధ్యాత్మిక గురువుగా శిష్యులకు ఉపదేశాలిచ్చే మాలిన్సన్ అనేకసార్లు అఘోరాలను కలుసుకున్నారు.

అఘోరాల వైఖరి సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలను తోసిపుచ్చేలా ఉంటుంది. తాము అనుసరించే ఆధ్యాత్మిక మార్గంలో శవాలను తినడం వంటి ప్రమాదకర పద్ధతులు పాటిస్తుంటారు.

ఇతరులకు భిన్నంగా తాము చేసే ఈ పనుల ద్వారానే అత్యున్నత చేతనాస్థితిని పొందుతామని వారు భావిస్తారు’ అంటారు మాలిన్సన్.

కుంభమేళా సమయంలో నదీసంగమంలో పవిత్ర స్నానాలకు వచ్చే అఘోరాల్లో కొందరు నకిలీలు కూడా ఉంటారని.. ఆ సమయంలో వచ్చే భక్తులు, పర్యటకులను పూజలు, ఆశీర్వచనాల పేరిట డబ్బు సంపాదించుకునేందుకు ఇలాంటి అవతారమెత్తేవారూ ఉంటారని చెప్పారు.

నిజమైన అఘోరాలకు డబ్బుపై వ్యామోహం ఉండదని, వారు డబ్బును ఆశించరని థక్కర్ తెలిపారు.

అఘోరాలు అందరి మంచి కోసం పూజలు చేస్తారని… పిల్లలు కలగాలని, ఇల్లు కట్టుకోవాలని.. ఇలా అనేక కోరికలతో వచ్చి ఆశీర్వచనాలు కోరేవారిని వారు ఏమాత్ర పట్టించుకోరని చెప్పారు.

అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. ఉత్తర భారతదేశంలో అఘోరాల్లో పురుషులే ఉంటారు.

కానీ, పశ్చిమబెంగాల్‌లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలూ కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు.

”చాలామంది చావంటే భయపడతారు. శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు. కానీ, అఘోరాలకు అదే ఆరంభ స్థానం. సాధారణ ప్రజలు పాటించే నియమాలు, విలువలను వారు ధిక్కరిస్తారు” అంటారు థక్కర్.

కుష్టు రోగుల సేవలో..

ఇటీవల కొన్ని సంవత్సరాలుగా అఘోరాలు బయటి ప్రపంచంలోని మంచినీ స్వీకరిస్తూ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. కుష్టు రోగులకు వైద్య సేవలు అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.

”సమాజం దూరం పెడుతున్న వర్గాల కోసం అఘోరాలు పనిచేస్తున్నారు” అని మిన్నెసోటాకు చెందిన మెడికల్, కల్చరల్ ఆంత్రోపాలజిస్ట్’ రాన్ బారెట్ చెప్పారు.

కుష్టు వ్యాధి బారినపడి సొంత కుటుంబాలకు దూరమైన ఎంతోమందిని అఘోరాలు వారణాసిలో తాము నిర్వహిస్తున్న ఆసుపత్రిలో చేర్చి సేవలందిస్తున్నారు. వారికి ఆయుర్వేదం నుంచి అల్లోపతీ వరకు అన్ని రకాల వైద్యం అందిస్తున్నారు.ఇటీవల కాలంలో కొందరు అఘోరాలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు చిన్నపాటి వస్త్రాలను ధరిస్తున్నారు. అంతేకాదు… కొందరు సెల్‌ఫోన్లు వాడుతున్నారు.. ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు.

స్వలింగ సంపర్కులు కారు.

దేశంలో ఎంతమంది అఘోరాలు ఉన్నారనే విషయంలో స్పష్టమైన లెక్కలు లేనప్పటికీ వేలసంఖ్యలో ఉన్నట్లు మాత్రం అంచనాలున్నాయి.”తాము మృతదేహాలతో సంభోగిస్తామని బహిరంగంగా అంగీకరించిన అఘోరాలు ఉన్నారు. కొందరు తాము జరిపే కర్మకాండల్లో భాగంగా వేశ్యలతోనూ సంభోగిస్తారు. కానీ, అఘోరాల్లో ఏ ఒక్కరూ స్వలింగ సంపర్కాన్ని ఆమోదించరు, ఆచరించరు” అని చెప్పారు మాలిన్సన్.

ఇంకో విషయం ఏంటంటే… అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను మిగతా అఘోరాలు తినరు. వారిని దహనమో, పూడ్చిపెట్టడమో చేస్తారు.

Comments

comments

Share this post

scroll to top