అజ్ఞాతవాసి కోసం ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారు ? ఎవరికి ఎక్కువంటే..?

పవన్  కళ్యాణ్ ,త్రివిక్రమ్ కాంభినేషన్లో ముచ్చటగా మూడోసారీ వచ్చిన సినిమా అజ్ణాతవాసి..సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన ఈ సినిమా అటు పవన్ ఫ్యాన్స్ ని ,ఇటు ప్రేక్షకులను కూడా నిరాశపర్చింది..కానీ కలెక్షన్ల పరంగా రిలీజ్ కి ముందే 150కోట్ల బిజినెస్ చేసింది అజ్ణాతవాసి..తొలి రోజు రికార్డ్ కలెక్షన్లను రాబట్టి బాహుబలి ది కంక్లూజన్ తర్వాత స్థానాన్ని కైవసం చేసుకుంది..అయితే ఇంత బిజినెస్ చేసిన ఈ  సినిమాకు ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేదాని పట్ల ఆసక్తి ఉండడం సహజం..ఆ వివరాలు మీకోసం..

పవన్ కళ్యాణ్

సినిమా హిట్లతో సంభందం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్..ఈ సినిమాతో త్రివిక్రమ్,పవన్ హ్యాట్రిక్ కొడతారనుకున్నారు..కానీ నెగటివ్ టాక్ వస్తుందని అస్సలు ఊహించని న్యూస్ ఇది..కాకపోతే ఈ సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ముప్పై కోట్లు..

త్రివిక్రమ్

రచయిత నుండి స్టార్ దర్శకుడిగా ఎదిగిన దర్శకుడు త్రివిక్రమ్..గురూజి గా ఎందరో అభిమానులను ,ఏకలవ్య శిష్యులను సొంతం చేసుకున్న దర్శకుడు ఈ  సినిమాకు ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట.

కీర్తి సురేశ్

సుకుమారి గా తన అందంతో నటనతో అందరిని అలరించిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ ఈ సినిమాకి కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

అను ఇమ్మాన్యుయేల్

ఈ మధ్య కాలంలో మెహరీన్ తర్వాత ఛాన్స్ లు కొట్టేస్తున్న ముద్దుగుమ్మలో అను ఇమ్మాన్యుయేల్ ముందుంటుంది. ఈ సినిమాలో తన సెక్సీ చూపులతో కుర్రకారు మతిపోగొట్టుంది.ఈ సినిమాలో తన నటించడానికి గానూ ఇరవై లక్షలు రెమ్యునరేషన్ తీసుకుందట..

అనిరుధ్ రవిచంద్రన్

గాలివాలుగా ఓ గులాబి వాలి… గాయమైంది నా గుండెకు తగిలి…అంటూ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన అనిరుద్  ఈ సినిమాకు మూడు కోట్లు రెమ్యునరేషన్ అడిగినట్టు సమాచారం..

ఇతర నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్ మొత్తం క‌లిపి 6 కోట్లు కాగా, ప్రొడ‌క్ష‌న్ కి 13 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.సినిమా ప్ర‌మోష‌న్‌కు మ‌రో 2 కోట్లు ఖ‌ర్చు చేశారు. దాదాపు 80 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ రిలీజ్ కి ముందే నిర్మాతకు 70 కోట్ల లాభాన్ని అందించింది. అన్ని ఏరియాల్లో థియేట్రికల్ రైట్స్ ద్వారా 120 కోట్లు, తెలుగు శాటిలైట్ రైట్స్ 19 కోట్లు, ఇతర భాషల శాటిలైట్ రైట్స్ 6 కోట్లు, డిజిటల్ రైట్స్ 7 కోట్లు, ఇతర హక్కులకు 3 కోట్లు మొత్తంగా అజ్ఞాతవాసి చిత్రం రూ.155 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు సృష్టించింది. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అదనపు షోలు, సంక్రాంతి సీజన్ కారణంగా ఈ మూవీ 200 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.

Comments

comments

Share this post

scroll to top